Monday, 14 June 2021

Navya Swamy: సీరియల్ నటితో సుడిగాలి సుధీర్ పెళ్లి.. దగ్గరుండి అన్నీ చూసుకున్న హైపర్ ఆది

బుల్లితెర, వెండితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పెళ్లి ముచ్చట్లకు సోషల్ మీడియాలో యమ డిమాండ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. నటీనటుల సీక్రెట్ ఎఫైర్స్, పెళ్లి సంగతులపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. దీంతో ఇదే సబ్జెక్ట్ తీసుకొని బుల్లితెర కామెడీ షోస్‌లో స్కిట్స్ చేస్తున్నారు కమెడియన్స్. ఈ నేపథ్యం లోనే , ఇమ్మానుయేల్, ఆటో రామ్ ప్రసాద్ అంతా కలిసి జబర్దస్త్ కమెడియన్ చేసేశారు. యంగ్ కమెడియన్ పెళ్లి మ్యాటర్ ఎప్పటినుంచో వైరల్ అవుతోంది. జబర్దస్త్ యాంకర్ రష్మీతో ఆయన లవ్ ఎఫైర్ నడిస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బోలెడన్ని వార్తలు పుట్టించారు. ఇవన్నీ ఓ రేంజ్‌లో వైరల్ అయి చర్చలో నిలవడంతో వీటిపై అటు సుధీర్, ఇటు రష్మీ క్లారిటీ ఇచ్చేశారు. ఇంతలో మధ్యలో ఫేమస్ సీరియల్ నటి రంగంలోకి దిగడం హాట్ టాపిక్ అయింది. తాజాగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో ఈ సీన్ కనిపించింది. నవ్య అంటే తనకు చాలా ఇష్టమంటూ ఇమ్మానుయేల్‌ని పిలిచి చెప్పారు సుధీర్. దీంతో అందరి సమక్షంలో నవ్యతో పెళ్లి చూపుల కార్యక్రమం ఏర్పాటు చేసి సుధీర్ పెళ్లి చేసేశాడు హైపర్ ఆది. తీరా పెళ్లయ్యాక ఫస్ట్ నైట్ ఉండదంటూ సడెన్ షాకిచ్చాడు మరో కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్. దీంతో సుధీర్ బిత్తరమొహం వేశాడు. చివరకు ఇదంతా డ్రామా అని తెలిసి కూల్ అయ్యాడు సుధీర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wpgaqD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...