Monday, 14 June 2021

Chiranjeevi : ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. సతీసమేతంగా చిరంజీవి రక్తదానం

మెగాస్టార్ రక్తదాన దినోత్సవం గురించి అందరికీ తెలిసిందే. రక్తం సరైన సమయంలో అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న చిరంజీవి.. బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. తన అశేష అభిమానులకు రక్తం దానాన్ని చేయండని పిలుపునిచ్చారు. అలా గత కొన్నేళ్లుగా మెగా అభిమానుల రక్తదాన కార్యక్రమం ఎంతో ఆదరణను దక్కించుకుంది. చిరంజీవి బర్త్ డే, రక్తదాన దినోత్సవం అంటూ ప్రత్యేక సందర్భాల్లో అభిమానులు రక్తదానం చేస్తుంటారు. రక్తదానం, నేత్రదానం అంటూ అభిమానులతో సేవా కార్యక్రమాలు చేయించడంలో చిరంజీవి ముందుంటారు. ఇప్పుడు కరోనా సమయంలో మరింత ముందడుగు వేశారు. సీసీసీ అంటూ ఏర్పాటు చేసిన చిరంజీవి సినీ కార్మికులకు అండగా నిలబడ్డారు. ప్రస్తుతం అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. తాజాగా చిరంజీవి సతీసమేతంగా రక్తదానం చేశారు. సందర్భంగా చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రక్తాన్ని దానం చేశారు. ఈ మేరకు చిరంజీవి ఓ పోస్ట్ చేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తాన్ని దానం చేస్తున్న అందరికీ.. మరీ ముఖ్యంగా నా బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి థ్యాంక్స్. వారంతా ఎంతో మంది ప్రాణాలను కాపాడుతారు. ఇలా ఎంతో చిన్న పనితో కొందరి విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. రక్తాన్ని దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి అని చిరంజీవి పిలుపునిచ్చారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత లూసిఫర్ రీమేక్‌ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3guAv7n
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...