Saturday, 19 June 2021

Nani: దారే లేదా.. గుండెలను పిండేసిన వీడియో! మహేష్ బాబు రియాక్షన్ వైరల్

ఓ వైపు కరోనా.. మరోవైపు వృత్తిపరమైన జీవితం. ఎంతో మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఈ కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు కుటుంబ బాధ్యతలు మోస్తూనే ఇటు వృత్తిలో భాగమవుతూ తమ జీవితాలను పణంగా పెట్టారు. ఈ కరోనా సమయంలో అలాంటి ఎన్నో సంఘటనలు గుండెలను పిండేశాయి. అలా ఎంతోమంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు అంకితమిచ్చేందుకు ‘’ అనే సాంగ్‌ రూపొందించారు నాచురల్ స్టార్ . తన వాల్ పోస్టర్ బ్యానర్‌పై రూపొందించి రిలీజ్ చేసిన ఈ పాటలో డాక్టర్స్ రియల్ లైఫ్, కుటుంబంతో వాళ్ళు గడిపే సమయం, పేషెంట్లకు చేసే సేవ ఎలా ఉంటుందనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. దీంతో విడుదల తర్వాత కోవిడ్‌ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ కృషికి ఈ ‘దారే లేదా’ సాంగ్ ప‌ర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్‌ అనే స్పందన తెచ్చుకుంది. గుండెలను పిండేస్తున్న ఈ వీడియో పలువురి ప్రశంసలు అందుకుంది. తాజాగా దీనిపై సూపర్ స్టార్ కూడా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన.. నాని, అతని టీమ్‌ కలిసి చేసిన 'దారే లేదా' వీడియోపై ప్రశంసలు గుప్పించారు. ''కరోనా ఆపత్కాల సమయంలో సేవ చేసిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌ని గౌరవించేందుకు మంచిదారి ఎన్నుకున్నారు. విశాల హృదయంతో చేసిన ఈ వీడియో చూసి.. నా హృదయం కూడా సంతోషంతో నిండిపోయింది. నాని టీమ్‌ అద్బుతమైన పనితనాన్ని ప్రదర్శించారు" అని మహేష్‌ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు మహేష్. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారి సూపర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి ఈ వీడియోకు ప్రశంసలు దక్కుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TLSC0L
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...