Saturday, 19 June 2021

వేగం పెంచుతున్న అల్లు అర్జున్.. పుష్ప రాజ్ వచ్చేది అప్పుడే! సుకుమార్ ప్లాన్

క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ''. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాపై సుకుమార్ ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసిన ఆయన.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా గ్యాప్ ఇచ్చారు. దీంతో ముందుగా అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేయడంతో తిరిగి సెట్స్ మీదకు వచ్చి మరికొద్ది రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి ఈ దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట సుక్కు. అతిత్వరలో ప్రారంభించనున్న షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు ఇతర తారాగణం మొత్తం పాల్గొనబోతున్నారట. ఈ మేరకు సినిమాకి సంబంధించిన షూటింగ్, నిర్మాణానంతర పనులను ఆగస్టు, సెప్టెంబర్ నెలకల్లా పూర్తి చేసి దసరాకు పుష్ప రాజ్‌ని ప్రేక్షకుల ముందుంచాలని సుకుమార్ ఫిక్సయ్యారట. అటు అల్లు అర్జున్ సైతం పుష్పతో పాటు తన సినిమాల వేగాన్ని పెంచాలని డిసైడ్ అయ్యారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఆయన చెల్లెలిగా ఐశ్వర్య రాజేష్ కనిపించనుందని టాక్. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు. ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్, అనసూయ రోల్ ఈ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు. ఇకపోతే పుష్ప మూవీని రెండు భాగాలుగా షూట్ చేస్తున్నారని తెలియడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీపై బన్నీ ఫ్యాన్స్ లెక్కకు మించిన అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UlBL5h
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...