Thursday, 24 June 2021

MAA Elections: ఎన్నికల బరిలో నందమూరి హీరో! బాలయ్య చెప్పాడని వెంటనే.. ఇంతలో ఊహించని ట్విస్ట్

టాలీవుడ్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల నేపథ్యంలో ఫిలిం నగర్ వాతవరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా ఈ టాపిక్ పైనే చర్చించుకుంటున్నారు. అయితే ఇప్పటికే 'మా' అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్ నటుడు ప్ర‌కాశ్ రాజ్‌, మంచు మోహన్ బాబు తనయుడు హీరో మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ ఉండగా.. తాజాగా నందమూరి వారసుడు, హీరో కూడా పోటీలో నిలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవి చూసి కళ్యాణ్ రామ్ టీమ్ వెంటనే స్పందించి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. గతంలో జరిగిన 'మా' ఎన్నికలు ఎంత సెన్సేషన్ అయ్యాయో తెలిసిందే. నటీనటుల మధ్య వార్ రసవత్తరంగా సాగి హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సారి సీన్ చూస్తుంటే అంతకుమించి అన్నట్లుగా కనిపిస్తోంది. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ ఎవరికి వారు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. మరోవైపు ఇప్పటికే అనసూయ, ప్రగతి, సుడిగాలి సుధీర్ లాంటి ట్రెండింగ్ స్టార్స్‌తో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించారు. ఇలాంటి సిచుయేషన్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా రంగంలోకి దిగుతున్నారనే న్యూస్ వైరల్ అయింది. బాబాయ్ నందమూరి కోరిక మేరకు కళ్యాణ్ రామ్ రేసులోకి వస్తున్నారని టాక్ నడిచింది. దీంతో ఈ విషయమై కళ్యాణ్ రామ్ టీమ్ రియాక్ట్ అయ్యారు. దయచేసి ఇలాంటి రూమర్స్ నమ్మకండి, మా అధ్యక్ష ఎన్నికల్లో కళ్యాణ్ రామ్ పోటీ చేయడం లేదు అని ప్రకటించారు. మరోవైపు ఈ రేసులో సాయి కుమార్ కూడా ఉండబోతున్నారనే సమాచారాలు షికారు చేస్తున్నాయి. ఏదేమైనా ట్విస్టుల మీద ట్విస్టులతో 'మా' ఎలక్షన్స్ జనాల్లో చర్చనీయాంశం అయ్యాయి. సీనియర్ స్టార్ హీరోల మద్దతు ఎవరికి లభిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3w2jeZ3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...