Saturday, 12 June 2021

Kaala Bhairava : ప్రతీసారి అలానే చేస్తాం.. కాళ భైరవపై నిహారిక కామెంట్స్

మెగా డాటర్ కొణిదెల సోషల్ మీడియాలో చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఆమె తన స్నేహితులతో చేసే అల్లరి ఎక్కువగా వైరల్ అవుతుంటుంది. కొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంకొందరు తన సినీ ప్రాజెక్ట్‌ల ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్‌తో కలిసి నిహారిక చేసే అల్లరి మామూలుగా ఉండదు. ఇక నిహారిక తన పెళ్లికి ముందు బ్యాచ్ లర్ పార్టీ అంటూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందులో కీరవాణి తనయుడు కాళభైరవ కూడా కనిపించారు. అయితే నిహారిక కాళ భైరవలకు చిన్నతనం నుంచే స్నేహం ఉందని అందరికీ తెలిసిందే. వారి గ్యాంగ్ అంతా కలిస్తే చేసే హంగామా, అందరూ కలిసి కాళ భైరవను ఎలా ఆటపట్టిస్తారో తాజాగా నిహారిక చెప్పుకొచ్చారు. సంగీత దర్శకుడిగా ఇప్పుడు ఎంత మంచి క్రేజ్ తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. అయితే అంతకు ముందు పెనిమిటి పాటతో అందరినీ ఆకట్టుకున్నారు. అరవింద సమేత సినిమాలోని పెనిమిటీ పాటను కాళ భైరవ పాడిన తీరు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కాళ భైరవ, నిహారిక ఇప్పుడు తమ స్నేహితులతో కలిసి వీకెండ్‌ను ఎంజాయ్ చేసినట్టున్నారు. ఈ క్రమంలో నిహారిక ఓ కామెంట్ చేశారు. ప్రతీసారి కలిసినప్పుడల్లా కాళ భైరవతో పాట పాడించుకుంటామని, అద్భుతంగా పాడుతాడు.. ఆ వాయిస్ అంటే మాకు ఇష్టమని నిహారిక కామెంట్ చేశారు. మొత్తానికి నిహారిక మాత్రం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో నిత్యం రచ్చ చేస్తున్నారు. ఇలా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wlX0Sv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...