Thursday, 17 June 2021

మా అన్నకి తగ్గ కోడలు ఉపాసన.. అపోలో హాస్పిటల్‌లో చాలా తక్కువకే ట్రీట్‌మెంట్: నాగబాబు ప్రశంసలు

కరోనా టైంలో తాను చాలామంది ట్రీట్ మెంట్ చేయించానని అది మీడియాకి కూడా తెలియదని అన్నారు మెగా బ్రదర్ . సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చిందని మెగా ఫ్యామిలీ హీరోలకు చేసిన సాయం చెప్పుకోవడం ఇష్టం ఉండదని అన్నారు నాగబాబు. ఇదే కాదు కష్టం వచ్చిన ప్రతిసారి అన్నయ్య ఎంతో మందిని ఆదుకున్నారు.. చేసిన సేవ చెప్పుకోవడం అన్నయ్యకి ఇష్టం ఉండదు. అలాగే కళ్యాణ్ బాబు ఎంతో మందికి సేవ చేశారు.. జనసేన పార్టీ తరపున జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్ ఎంతో మందికి సేవ చేస్తున్నారు. మా పిల్లలు అందరూ కూడా వారి వారి శాయశక్తులా నిశ్శబ్ధంగా చేసుకుంటూ పోతున్నారు. అలాగే.. మా అన్నయ్య గారి కోడలు ఎంతోమందికి సాయం చేసింది. నిజం చెప్పాలంటే.. అపోలో ఆసుపత్రి చాలా పెద్ద హాస్పటల్.. కార్పోరేట్ ఆసుపత్రిలా ఉన్నా.. చాలా తక్కువ కాస్ట్‌కి కరోనా ట్రీట్ మెంట్ అందించారు. నేను మా ఉపాసనని అడిగా.. ఏమ్మా ఇంత తక్కువకి ఎలా చేస్తున్నావ్ అని అడిగితే.. ఇలాంటి టైంలోనే కదా.. మనం పది మందికి ఉపయోగపడాలి.. నార్మల్ టైంలో మనం కమర్షియల్‌గా ఉన్నప్పటికీ ఇలాంటి టైంలో సాయం చేయాలి అని ఆమె చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. మా అన్నయ్యకి తగ్గ కోడలు అనిపించింది. అన్నయ్య కూడా ఉపాసన ద్వారా ఎన్నో చేయించారు. అన్నయ్య ఏదైనా అడిగిన వెంటనే స్పందించి ఎంతో మందికి సేవ చేసింది. సినీ కార్మికులందరికీ అన్నయ్య వ్యాక్సిన్ వేయించారంటే ఉపాసన సాయంతోనే. కోడల యొక్క సంపూర్ణ సహకారం మా అన్నయ్యకు ఉంది అంటూ ఉపాసనపై ప్రశంసల వర్షం కురిపించారు మెగా బ్రదర్ నాగబాబు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zxVizA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...