Thursday, 17 June 2021

అది అవసరం పడుతుంది.. రాశీ ఖన్నా పోస్ట్ వైరల్

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రాశీ ఖన్నా తెరపై అంతగా అందాలను ప్రదర్శించేవారు కాదు. కానీ ఈ మధ్య రూట్ మార్చేసినట్టు కనిపిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత బికినీలో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉన్న రాశీ ఖన్నా.. నాజూగ్గా మారిపోయారు. ఏడాదికి పైగా కష్టపడి జీరో సైజ్‌లోకి ఇలా బికినీ ఆకారంలోకి వచ్చానని తన ఫిట్ నెస్ మంత్రాన్ని చెప్పారు. రాశీ ఖన్నా చేసే ఫోటోషూట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. కేవలం చీరకట్టు ఫోటో షూట్లతోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం రాశీ ఖన్నా విషయంలోనే జరిగినట్టుంది. అలా నెట్టింట్లో రాశీ ఖన్నా ప్రస్తుతం దూసుకుపోతోన్నారు. ఇక కెరీర్ పరంగా రాశీ ఖన్నా ఓ మెట్టు ఎక్కేసినట్టు కనిపిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు చేజిక్కించుకుంటున్నారు. రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో పలు ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. రాజ్అండ్ డీకే తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే రాశీ ఖన్నా ఇటీవలె సేవా కార్యక్రమాలతోనూ మంచి పేరును సంపాదించుకుంటున్నారు. తాజాగా రాశీ ఖన్నా షేర్ చేసిన ఫోటోలతో పాటు కామెంట్ కూడా వైరల్ అవుతోంది. ఏదో ఒక నాడు మీ అందరికీ సార్లు సూర్యరశ్మి అవసరంపడుతుందని చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vxyQn2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...