Saturday, 5 June 2021

పెళ్లిలో ఉమ ఏం చేసిందంటే.. అసలేం జరిగింది? మ్యారేజ్ తర్వాత తొలిసారి కాజల్ అగర్వాల్

ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది స్టార్ హీరోయిన్ . గత కొన్నేళ్లుగా ఆయనతో ప్రేమాయణం నడిపించి చివరకు పెళ్లి పీటలెక్కి ఒక్కసారిగా అందరినీ సర్ప్రైజ్ చేసింది టాలీవుడ్ చందమామ. ఇక పెళ్లి చేసుకొని కొన్ని నెలలపాటు భర్తతో షికార్లు కొడుతూ హనీమూన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ.. తిరిగి కెమెరా ముందు బిజీ అయింది. వరుస సినిమాలకు కమిటవుతూ సినీ జర్నీ కొనసాగిస్తోంది. పెళ్లికి ముందే కమిటైన సినిమాలు కంప్లీట్ చేస్తూనే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది కాజల్. ఈ క్రమంలోనే మ్యారేజ్ తర్వాత తొలిసారి ఓ హిందీ సినిమాను ఓకే చేసింది. పెళ్లి నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడట డైరెక్టర్. ఇందులో 'ఉమ' అనే రోల్ పోషించబోతోందట కాజల్. ఓ పెళ్లి ఇంట అనే ఆమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అసలు ఉమ ఏం చేసింది? అనేది పాయింట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నారట. సింఘా దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు అవికేష్‌ ఘోష్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు సుజోయ్‌ ఘోష్‌ క్రియేటివ్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాజల్ పాత్ర పేరు 'ఉమ'నే సినిమా పేరుగా తీసుకున్నారట. ‘‘నటిగా సవాల్‌తో కూడిన పాత్రలతో పాటు వినోద్మాతక కథల్లో నటించడాన్ని నేనెప్పుడూ ఇష్టపడతా. ‘ఉమ’ అనేది అలాంటి కథే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని కాజల్‌ చెప్పింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cgm6dy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...