Wednesday, 2 June 2021

నాని విడుదల చేసిన ‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్.. ఉత్కంఠ భరిత సన్నివేశాలతో వీడియో.. ఆహాలో రిలీజ్

విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకెళ్తున్న యాక్టర్ '' అంటూ మరో వైవిద్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, సాయి కుమార్ వంటి దిగ్గజ నటులు భాగస్వామ్యం కావడం విశేషం. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ భరిత సన్నివేశాలతో కూడి సినిమాపై హైప్ పెంచేసింది. ‘ఈ విశాల సృష్టిలో మ‌నిషి క‌న్నా ముందు ఎన్నో జీవ‌రాశులుండేవి. ఒకానొక రాక్ష‌స ఘ‌డియ‌లో మానవ జాతి పుట్టుక సంభ‌వించింది’ అని శుభ‌లేఖ సుధాక‌ర్ చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. తెలంగాణ‌లో కుగ్రామ మూలాల్లోని రాజ‌కీయాల‌కు, కుల వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఉండే రా ఎమోష‌న్స్‌, ఇన్‌టెన్స్ యాక్ష‌న్‌, ర‌స్టిక్ రొమాన్స్ వంటి ప‌లు అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం రూపొందిన‌ట్లు ఈ ట్రైలర్ చూస్తుంటే అర్థమ‌వుతోంది. ట్రైలర్ విడుదల చేసిన నాని.. 'అర్ధ శ‌తాబ్దం' ట్రైల‌ర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాల‌నే ఆస‌క్తి పెంచింది. ఆహాలో జూన్ 11 నుంచి ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. నటీనటులందరూ చక్కగా నటించారు. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు అని అన్నారు. రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు చిట్టి కిరణ్ రామోజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vNMSSu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...