Wednesday, 2 June 2021

తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రేయా ఘోషల్.. మాటల్లో చెప్పలేనంత ప్రేమంటూ ఎమోషనల్ పోస్ట్

ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యిందో అప్పటినుంచి ఎప్పటికప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటూ వచ్చింది సింగర్ . ఏ మాత్రం మొహమాట పడకుండా తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చిన ఆమె.. గత వారం రోజుల క్రిందట గుడ్ న్యూస్ చెప్పింది. తాను పండంటి మ‌గ‌బిడ్డకు జన్మనిచ్చానని తెలుపుతూ తల్లయ్యాక తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తన బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆ దేవుడి ఆశీర్వాదంతో పండంటి మ‌గ‌బిడ్డ పుట్టాడని, తాను తన భర్త శైలాదిత్య‌, కుటుంబ స‌భ్యులం అంద‌రం చాలా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పిన శ్రేయా ఘోషల్.. గతంలో ఎప్పుడూ లేని ఫీలింగ్ ఇది అంటూ ఆశీర్వాదాలు పంపిన అంద‌రికీ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు చెప్పింది. తాజాగా తన కొడుకును అందరి ముందుకు తీసుకొచ్చింది. ఈ మేరకు ఆమె పోస్ట్ చేసిన ఫొటోలో.. చేతిలో ఆ బిడ్డను పట్టుకొని ప్రేమగా మురిసిపోతూ కనిపించారు శ్రేయా ఘోషల్ దంపతులు. తన కొడుకు పేరు దేవయాన్ ముఖోపాధ్యాయ అని చెప్పిన శ్రేయా ఘోషల్.. మే 22న కుటుంబంలోకి వచ్చిన తన కొడుకు తమ జీవితంలో సంతోషం నింపాడని పేర్కొంది. తల్లిగా, తండ్రిగా తమ హృదయాలు మాటల్లో చెప్పలేనంత ప్రేమతో నిండిపోయాయని ఆమె చెప్పింది. శ్రేయా ఘోషల్ కొడుకు చూసి మురిసిపోవడమే గాక ఆ పేరు చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34EnLp9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...