Friday, 4 June 2021

హిట్ కొట్టాడు కొత్త ప్రాజెక్ట్ పట్టాడు.. జోరు మీదున్న సంతోష్ శోభన్

యంగ్ హీరో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోకు మొదటి సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. స్వర్గీయ దర్శకుడు శోభన్ కోసం ప్రభాస్ వంటి స్టార్ హీరో ముందుకు సంతోష్‌కు అండగా నిలబడ్డారు. అయితే ఎట్టకేలకు సంతోష్ శోభన్‌కు ఓ హిట్ పడింది. అంటూ వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్‌లో గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. జననాంగం చిన్నగా ఉందనే అపోహతో సతమతమయ్యే కుర్రాడి పాత్రలో సంతోష్ శోభన్ అద్భుతంగా నటించేశారు. తనది తాను నిరూపించుకునేందుకు ఒక్క హిట్ చాలు అన్నట్టుగా సంతోష్ శోభన్‌కు ఏక్ మినీ కథ దొరికింది. అలా మొదటి సక్సెస్‌ను సంతోష్ శోభన్ భారీగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అలా ఇదే ఊపులో తన తదుపరి ప్రాజెక్ట్‌లను కూడా లైన్‌లో పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే తన కొత్త సినిమా అప్డేట్‌ను ఇచ్చారు. ఏక్ మినీ కథ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన సంతోష్.. ఈ సారి పెళ్లి మీద రాబోతోన్న కాన్సెప్ట్‌కు ఓకే చెప్పినట్టున్నారు. అంటూ వదిలిన పోస్టర్ చూస్తుంటే.. పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉన్నా కూడా అమ్మాయిలు దొరక్కా.. చేతిలో తాళి బొట్లు పట్టుకుని భూతద్దం పట్టుకుని వెతుక్కున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి పోస్టర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ప్రేమ్ కుమార్ చిత్రయూనిట్. ఈ సినిమాకు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహిస్తుండగా.. శరంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uUl9y2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...