Tuesday, 15 June 2021

ఎన్టీఆర్‌తో తెరపంచుకోనున్న విజయ్ సేతుపతి.. భారీ రేంజ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ ప్లాన్స్!

ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమాతో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తికాగానే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా, అదేవిధంగా పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో మరో సినిమా లైన్‌లో పెట్టారు. ఈ రెండు సినిమాలు భారీ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్- కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ భాగం కాబోతున్నట్లు సమాచారం. కేజీఎఫ్‌ సినిమాతో టాలెంట్ రుజువు చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ -2 రూపొందిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్' మూవీ చేస్తున్నారు. వీటితో పాటు ఎన్టీఆర్ సినిమాను కూడా లైన్‌లో పెట్టారు. ఇందుకోసం పదునైన కథ సిద్ధం చేసిన ఆయన.. ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో ఇందుకు సంబందించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా రానుందట. ఇకపోతే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించబోతున్నారని సమాచారం. బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా కథ రాసుకున్నారని, ప్రపంచాన్నే గడగడలాడించే పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా ఎన్టీఆర్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ సేతుపతిని కూడా భాగం చేస్తున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. సో.. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజమవుతుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3zuGLV4
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...