Sunday, 6 June 2021

ఎప్పుడూ గొడవలే భేదాభిప్రాయాలున్నాయ్.. కానీ అంటూ సంసారం గుట్టు విప్పిన అనసూయ

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై అద్భుతమైన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ. అలాంటి వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ప్రేమ,పెళ్లి వంటి విషయాల గురించి ఎన్నో సార్లు స్వయంగా మీడియా ముందు బహిరంగంగానే చెప్పుకున్నారు. ప్రేమ పెళ్లి ఇంట్లో వాళ్లకు నచ్చకపోవడం,పెద్దలను ఎదురించి మరీ వివాహాం చేసుకోవడం ఇలా ఆమె లవ్ స్టోరీని ఓ సినిమాగా కూడా తీయొచ్చు. అలా తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని అనసూయ చెబుతూనే ఉంటారు. తొమ్మిదేళ్ల ప్రేమ.. తదనంతరం వివాహా బంధంగా మారిందని అనసూయ ఎప్పుడూ చెబుతుంటారు. ఈ రోజు ఈ జంట వివాహా దినోత్సవం. ఇది పదకొండో పెళ్లి రోజు. అని తమ ప్రేమకు ఇరవై యేళ్లు నిండాయ్ అని అనసూయ గాల్లో తేలిపోతోన్నారు. ఈ శుభ సందర్భంలో అనసూయ తన సంసారం గుట్టు విప్పేశారు. తాను, తన భర్త ఇంట్లో ఎలా ఉంటారో పూసగుచ్చినట్టు వివరించారు. ఎన్‌సీసీ క్యాంప్‌లో తమ ప్రేమ మొదలైందని, ఆయన ప్రపోజల్ బాగా నచ్చిందని, ప్రేమ గురించి మాట్లాడకుండా నేరుగా పెళ్లి విషయాన్నే ప్రస్థావించారని అనసూయ చెబుతుంటారు. అలా మొత్తానికి ఎన్నో మలుపుల తరువాత ఇంట్లో వాళ్లను ఒప్పించి ఇద్దరం ఒక్కటయ్యామని అనసూయ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా తన భర్త మీద అనసూయ కొన్ని ఫిర్యాదులు చేశారు. మేం ఇద్దరం ఒకరినొకరం కొట్టుకుంటాం.. గొడవలు పడుతుంటాం.. చిరాకు వచ్చేలా చేసుకుంటాం.. కొన్ని సందర్భాల్లో మాకు ఒకే అభిప్రాయం ఉండదు.. భేదాభిప్రాయాలు వస్తాయ్. కొన్ని పిచ్చి పనులు కూడా చేస్తుంటాం. ఇక రేపు అనేదే లేనట్టుగా కొట్టుకుంటాం..గొడవలు పడుతుంటాం. మళ్లీ ఆ వెంటనే.. ఒకరి చేతిని ఒకరం పట్టుకుంటాం.. అన్నీ మరిచిపోతాం. అదే మమ్మల్ని ఇంత వరకు తీసుకొచ్చింది.. ఐలవ్యూ.. ఇక నేను నీకోసం చెప్పేందుకు ఇంతకన్నా నాకేమీ తెలియదు. మేం ఈరోజు కూడా గొడవలు పడ్డాం.. అందుకే కొత్త ఫోటోలేవీ పెట్టడం లేదు’ అని అనసూయ చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TFWxvX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...