Wednesday, 23 June 2021

'హీరో'కి మహేష్ బాబు సపోర్ట్.. ఇస్మార్ట్ బ్యూటీతో రొమాన్స్! ఇక రెడీ అంటున్న బిజినెస్‌‌మెన్ కొడుకు

టాలీవుడ్‌లో మరో '' అడుగుపెట్టాడు. అతనికి సూపర్ స్టార్ సపోర్ట్ లభించింది. మహేష్ బాబు బావ, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమా 'హీరో'తో ఆయన కెమెరా ముందుకొస్తున్నాడు. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో అశోక్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే చిత్ర ప్రమోషన్స్‌ చేపట్టిన చిత్రయూనిట్‌ మహేష్ బాబు సపోర్ట్ అందుకుంది. మహేష్ చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం 'హీరో' టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా మలిచిన ఈ వీడియోలో కౌబాయ్‌, జోకర్‌ గెటప్పుల్లో కనిపించాడు అశోక్ గల్లా. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో జగపతిబాబు, వెన్నెల కిషోర్‌, నరేష్‌, బ్రహ్మానందం, సత్య, అర్చన సౌందర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్నారు. టైటిల్ టీజర్‌ని బట్టి చూస్తే ఇదో వైవిద్యభరితమైన కథాంశం అని అర్థమవుతోంది. సో.. చూడాలి మరి ఈ 'హీరో' తొలి సినిమాతో ఏ మేర మెప్పిస్తాడనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TTlynC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...