Thursday, 3 June 2021

నా కొడుకు ఎదుగుతున్నాడు!.. నిహారిక కొణిదెల పోస్ట్ వైరల్

సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తరువాత మెగా డాటర్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు. ఇక వస్త్రాధారణలోనూ ఎంతో మార్పు వచ్చింది. అలా నిహారిక సోషల్ మీడియాలో చేసే సందడి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ లాక్డౌన్‌లో నిహారికకు బోర్ కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. వంటింట్లోకి దూరి రకరకాల వంటలను వండుతున్నారు. పెళ్లి తరువాత నిహారిక కొత్త రెసిపీలను ట్రై చేస్తున్నట్టున్నారు. ఆ మధ్య ఆపిల్ పై అంటూ కొత్త రకమైన పదార్థాన్ని వండారు. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంట్లోనే ఉంటోన్న నిహారిక కొత్తగా రెడీ అవుతోంది కూడా. మేకప్ వేసుకుంటూ రెడీ అయిన ఫోటోను నిహారిక షేర్ చేయగా అది తెగ వైరల్ అయింది. అలా నిహారిక ప్రస్తుతం ఏదో ఒక వ్యాపకం అంటూ సమయాన్ని గడిపేస్తోన్నారు. ఇక నిహారిక బర్త్ డే సందర్బంగా తన భర్త చైతన్య జొన్నలగడ్డ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి తరువాత నిహారిక మొదటి పుట్టిన రోజు కావడంతో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతో ఓ స్పెషల్ పెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దాన్ని తమ సంతానంగా, తన కొడుకుగా నిహారిక భావిస్తుంటుంది. ఇక దానికి బజ్ అని నామకరణం కూడా చేశారు. తమ ఇద్దరికి ఏం తోచనప్పుడు చేతులో చేయి వేసుకుని పడుకుంటామని తన పెట్ బజ్ గురించిచెప్పుకొచ్చారు. తన బేబీ బాయ్ పెద్దగా అవుతున్నాడంటూ నిహారిక మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wUPqhH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...