Thursday, 3 June 2021

వయసుపై నెటిజన్ కామెంట్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన హీరోయిన్ వర్ష బొల్లమ్మ

హీరోయిన్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. డబ్బింగ్ సినిమాలతో వర్ష బొల్లమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. విజిల్, 96 సినిమాలతో వర్ష బొల్లమ్మ కుర్రకారును కట్టిపడేశారు. ఇక అలా డబ్బింగ్ సినిమాలతో ఫేమస్ అయిన వర్ష బొల్లమ్మ తెలుగులోనే చూసీ చూడంగానే అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే మొదటి సినిమాతో టాలీవుడ్‌లో వర్ష అంతగా విజయాన్ని అందుకోలేకపోయారు. అయితే గత ఏడాది వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మొదటి సారిగా తెలుగులో మంచి సక్సెస్‌ను రుచిచూశారు. ఇక ఈ చిత్రంతో వర్ష పోషించిన పాత్రకు, ఆమె నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఆమె హావభావాలు నెట్టింట్లో ఎంతగానో వైరల్ అయ్యాయి. వర్ష బొల్లమ్మ తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటారు. తాజాగా ఆమె తన అభిమానులతో ఇన్ స్టాగ్రాంలో ముచ్చట్లు పెట్టేశారు. ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఆమె వయసు గురించి ప్రశ్నించాడు. నీకు 25 ఏళ్లు అని గూగుల్ చూపిస్తోంది..అది నిజమేనా? అని ప్రశ్నించాడు. దానికి వర్ష వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇస్తోన్న ఫోటోలను షేర్ చేస్తూ కౌంటర్ వేశారు. నేను మామూలుగా అయితే 96లో పుట్టాను.. అంటే 24 ఏళ్లు ఉండాలి.. నాకు తెలిసి ఈ విషయం మా అమ్మ కంటే గూగుల్‌కే ఎక్కువగా తెలిసి ఉండాలి.. అంటూ సెటైర్ వేశారు. ఇక కొందరు 96 సినిమాలోని నటన, మిడిల్ క్లాస్ మెలోడీస్‌లోని వింత ఎక్స్ ప్రెషన్స్ గురించి ప్రశ్నలు సంధించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wTCCYP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...