Sunday, 6 June 2021

యాక్టర్ అయినప్పుడు అలాంటివి తప్పదు.. నచ్చకపోయినా సరే.. శ్రద్దా దాస్ కామెంట్స్ వైరల్

ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ రేంజ్‌లో దూసుకుపోయారు. వెండితెరపై ఆమె అందాల ప్రదర్శన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే శ్రద్దా దాస్‌కు అందం ఉన్నా కూడా అంతగా అదృష్టం లేనట్టు కనిపిస్తుంది. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఆమెకంటూ గుర్తింపునిచ్చే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు. అలా శ్రద్దా దాస్ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్యే వచ్చిన సినిమాతో శ్రద్దా దాస్ సోషల్ మీడియాలో దుమ్ములేపుతోన్నారు. మాములుగా అయితే శ్రద్దాదాస్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రద్దా దాస్ బికినీ ఫోటోలతో హల్చల్ చేస్తుంటారు. అలాంటి శ్రద్దా దాస్ ఇప్పుడు ఏక్ మినీ కథ సక్సెస్ జోష్‌లో ఉన్నారు. స్వామిజీగా కనిపించిన శ్రద్దాదాస్ తన వయ్యారాలను ప్రదర్శించారు. అందాల ఆరబోతతో కుర్రకారును కట్టిపడేశారు. అంతేకాకుండా సిగరెట్ తాగుతూ కూడా కనిపిస్తారు. అయితే తాజాగా తన సినిమా సెట్‌లోని ఓ స్టిల్‌ను శ్రద్దా దాస్ షేర్ చేశారు. అందులో ఆమె దమ్ముకొడుతూ కనిపించారు. దాని గురించి వివరిస్తూ అసలు విషయం చెప్పారు. విచిత్రం ఏంటంటే.. నాకు సిగరెట్ తాగడం నచ్చదు.. కానీ నటిగా మారినప్పుడు.. అన్నీ చేయాల్సి వస్తుంది.. నచ్చకపోయినా సరే అంటూ అసలు విషయాన్ని అందరికీ చెప్పేశారు. సినిమాల్లో తనకు నచ్చకపోయినా కూడా అలా కనిపించానని చెప్పకనే చెప్పేశారు. శ్రద్దాదాస్ ప్రస్తుతం కన్నడలో కోటిగొబ్బ, తెలుగులో అర్ధం, నిరీక్షణ అనే సినిమాలతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gjlhCa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...