Wednesday, 2 June 2021

ప్రభాస్-అనుష్క‌లు సెట్‌లో అలా బిహేవ్ చేస్తారు.. వాళ్ల పెళ్లి కోసం నేనూ వెయిటింగ్: నటుడు కాశీ విశ్వనాథ్

టాలీవుడ్‌ స్వీటీ అనుష్క.. రెబల్ స్టార్ జోడీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆన్ స్క్రీన్‌పై రొమాన్స్ పండించి అదరహో అనిపించిన వీరిద్దరూ రియల్ కపుల్ కాబోతున్నారంటూ ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అయితే పలు సందర్భాల్లో తాము మంచి స్నేహితులమే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ రూమర్ కేవలం ఆడియన్స్‌లోనే కాదు.. ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఉండగా.. ప్రభాస్, రిలేషన్‌పై ఓపెన్ అయ్యారు సీనియర్ నటుడు, దర్శకుడు కాశీ విశ్వనాథ్. మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో నటించిన కాశీ విశ్వనాథ్.. ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఆయనతో కలిసి నటిస్తున్నా.. ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ స్టార్ రేంజ్‌కి ఎదిగినప్పటికీ స్టార్టింగ్‌లో ఎలాగైతే ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు. గర్వం అనేది ఆయనలో కనిపించదు. కొంతమంది సక్సెస్ వస్తే మారిపోతుంటారు.. కానీ ప్రభాస్ ఎంత పెద్ద సక్సెస్ చూసినా ఆయనలో మార్పు ఉండదు. ఇగో ఉండదు.. బంగారం లాంటి వ్యక్తి. ఎప్పుడు కనిపించినా అదే చిరునవ్వు.. అదే హ్యాపీనెస్. చాలా సింపుల్‌గా ఉంటారు. హీరో అనే ఫీలింగ్ ఉండదు.. వర్క్ పట్ల చాలా డెడికేషన్‌గా ఉంటారు. ఆయన చాలా స్వీట్ పర్శన్. ఇక స్వీటీ (అనుష్క) గురించి చెప్పాలంటే.. మిర్చిలో అనుష్కకి ఫాదర్‌గా నటించా. స్వీటీ విషయంలో నేనే కాదు.. ఆమెతో నటించిన వారు ఎవరైనా సరే అలాంటి ఒక కూతురు ఉండాలి.. అలాంటి ఒక సిస్టర్ ఉండాలని కోరుకుంటారు. అస్సలు ఇగో ఉండదు.. హైప్ ఉండదు. చిన్న చిన్న వాళ్లని కూడా పలకరిస్తుంది. మనస్పూర్తిగా మాట్లాడుతుంది. ఎక్కడ కనిపించినా చాలా ప్రేమతో పలకరిస్తుంది. అందుకే స్వీటీ అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టం. ఇక ప్రభాస్, స్వీటీలు సెట్‌లో ఎలా ఉంటారంటే.. ఇద్దరు మంచి మానవత్వం కలిగిన వ్యక్తులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో వారిద్దరి మధ్య సంభాషణ అలా ఉంటుంది. వాళ్లిద్దర్నీ చూసి డౌట్ పడే విధంగా కానీ.. ఇదేంటి వీళ్లు ఇలా బిహేవ్ చేస్తున్నారని అనిపించేట్టుగా కానీ.. వాళ్లు ఉండరు. వాళ్ల గురించి చెడుగా అనుకోవాలనే ఆలోచన కూడా రాదు. ఒక హీరో హీరోయిన్ ఎలా ఉంటారో సెట్‌లో అలా ఉంటారు. ప్యూర్ అండ్ జన్యూన్‌గా ఉంటారు. వాళ్ల విషయంలో నాకు ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే.. ధైర్యంగా అనౌన్స్ చేసి వాళ్లు ఒకటైతే చూడాలనుకునేవాళ్లలో నేనూ ఒకడ్ని. పెళ్లి గురించి నేను ఎప్పుడూ అనుష్కని అడగలేదు. తండ్రిగా ఫీల్ అయితే ఆమె పెళ్లి బాధ్యత నాదే. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది.. వాళ్లకి కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. వాళ్ల పర్సనల్ లైఫ్‌లో వేలు పెట్టి కెలికి.. మీడియా వాళ్లలా అడగకూడదు మేం’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు కాశీ విశ్వనాథ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cdASld
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...