Wednesday, 2 June 2021

వేరే లెవెల్ ప్లానింగ్.. హాలీవుడ్ స్థాయిలో జక్కన్న.. రాజమౌళి రేంజ్ వేరు!

దర్శకధీరుడు స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్థాయిని దృష్టిని ఆకర్షించారు. బాహుబలి చిత్రంతో దేశం మొత్తానికి ఆకర్షించారు. ఇప్పుడు సినిమాతో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచేందుకు సిద్దమవుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న ఈ మూవీని అంతర్జాతీయంగా విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను విక్రయించినట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ మీద ఓ విషయం బయటకు వచ్చింది. అది స్వయంగా రాజమౌళి తండ్రి, కథకుడు చెప్పుకొచ్చారు. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటల ప్రకారం రాజమౌళి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోన్నట్టు తెలుస్తోంది. దీని కోసం అదిరిపోయే కథను రాసినట్టు తెలిపారు. ఈ మేరకు విజయేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ‘రాజమౌళి కోసం కథ రాశాను. లైవ్‌ యానిమేషన్‌. చాలా పెద్ద ప్రాజెక్టు. అంటే హాలీవుడ్‌ నటులతో సినిమా చేస్తున్నాడని కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా ఉంటుంది. భారతీయ కంటెంట్‌తోనే సినిమా ఉంటుంది. హాలీవుడ్‌ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేస్తారంతే’ అని రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి హింట్ ఇచ్చారు. అయితే ఈ లెక్కన ఆ సినిమాలో నటించే ఏ స్టార్ హీరో హీరోయిన్లకు వస్తుందో అని నెటిజన్లు గుసగుసలు ఆడుకుంటున్నారు. మొత్తానికి రాజమౌళి తన రేంజ్ వేరే అని నిరూపించుకుంటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3c8K6PB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...