Tuesday, 8 June 2021

చిన్న ఇంజక్షన్‌కు భయపడ్డ ప్రశాంత్ నీల్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు.. డైరెక్టర్‌పై ట్రోలింగ్

ఒక్కొక్కరి ఒక్కో రకమైన ఫోబియా ఉంటుంది. కొందరికి నీళ్లంటే భయం.. ఇంకొందరికీ ఎత్తైన ప్రదేశాలంటే భయం.. మరికొందరికి ఇంజక్షన్లు, సూదులు వేయించుకోవడం అంటే భయం. ఆ ఫోబియా మన కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ఉన్నట్టుంది. భారీ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు తీసి వెండితెరపై విధ్వంసం సృష్టించే డైరెక్టర్ అలా చిన్న సూదికి భయపడటంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. సరదాగా ప్రశాంత్ నీల్‌ను మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు. అసలింతకీ ఏం జరిగిందంటే? ప్రశాంత్ నీల్ తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ ఆయన ఓ ఫోటోను షేర్ చేశారు. మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నాను.. మీరు ఇంకా వేసుకోలేదంటే.. త్వరగా బుక్ చేసుకోండి.. వేసుకోండి.. అందరూ సురక్షితంగా ఉండండి అని కోరారు. దీంతో పాటు ఆయన వ్యాక్సిన్ వేసుకుంటున్న ఫోటోను షేర్ చేశారు. దీంట్లో ఆయనకు సూది పొడుస్తుంటే కళ్లు మూసుకుని పక్కకు తిరిగి ఉన్నారు. ఇక ఈ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోపై కేజీయఫ్ చాప్టర్ 2 నటి రవీనా టాండన్ సెటైర్ వేశారు. ఇది భలే ఫన్నీగా ఉంది ప్రశాంత్.. నువ్ నా వీడియో చూడాల్సింది.. అంటూ తను కూడా అంతే అన్నట్టుగా హింట్ ఇచ్చారు. దీనిపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. అవును మేడం మేం ఆ వీడియోను చూడాల్సింది.. అది మా అందరినీ మోటివేట్ చేసి ఉండేదేమో అని కౌంటర్ వేశారు. ఇక ప్రశాంత్ నీల్ అలా చిన్న ఇంజక్షన్‌కు భయపడటంతో తెగ ఆడేసుకుంటున్నారు. మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. పేరుకేమో పెద్ద డైరెక్టర్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు తీస్తారు.. ఇలా చిన్నదానికే భయపడిపోయారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్‌తో తీస్తున్నారు. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fZ4Uvk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...