Thursday, 24 June 2021

సురేష్ ప్రొడక్షన్స్ మరో అడుగు.. అదే టార్గెట్‌గా ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ప్రొడక్షన్ కంపెనీ

().. సగటు టాలీవుడ్ ప్రేక్షకుడికి ఈ బ్యానర్ ఎంతో సుపరిచితం. నిర్మాత డి. రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ ఎన్నో హిట్ సినిమాలను అందించింది. 50 ఏళ్లుగా కొనసాగుతున్న బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ దాదాపు అన్ని ఇండియన్ భాషల్లో ఎన్నో అద్భుత‌మైన సినిమాలను రూపొందించి ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ పతాకాల్లో ఒకటిగా నిలిచింది. రామానాయుడు మరణం తర్వాత ప్ర‌స్తుతం ఈ సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలకు ఆయన కుమారుడు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార విస్తరణ చేస్తూ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌ని మరింత ముందుకు తీసుకుపోతున్నారు సురేష్ బాబు. ఇందులో భాగంగా ఇప్పటికే సినిమాల డిస్ట్రిబ్యూష‌న్ కూడా చేసున్న ఆయన, తాజాగా మ్యూజిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్’ అనే లేబుల్‌తో మార్కెట్ లోకి రాబోతున్నారు అధికారికంగా ప్రకటించారు. మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిదని, అందుకే దాని అవ‌స‌రాన్ని గుర్తించి మంచి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఓ వేదికగా ‘’ ప్రారంభిస్తున్నామని తెలిపారు. మ్యూజికల్ పవర్ హౌస్ కావాలనేది తమ లక్ష్యం అని పేర్కొన్నారు. 120కి పైగా సినిమాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్.. ఆ సినిమాలకు సంబంధించిన మ్యూజిక్‌తో పాటు బయట సంస్థల నుంచి కూడా ఆడియో హక్కులని అందుకోనుందని, మ్యూజిక్ ఫ్లాట్‌ఫాంలో కూడా సరికొత్తగా నడవాలని అనుకుంటున్నామని సురేష్ బాబు అన్నారు. ఇక ఈ బ్యానర్‌పై రీసెంట్‌గా వచ్చిన 'వెంకీ మామ' మూవీ సూపర్ హిట్ కాగా.. ప్రస్తుతం ''నారప్ప, దృశ్యం 2'' సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/362fPPn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...