Tuesday, 22 June 2021

Akkineni Nagarjuna: జయప్రద ఎంట్రీ ఫిక్స్! ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు.. ఇదీ మ్యాటర్

టాలీవుడ్ కింగ్ కోసం సీనియర్ నటి రంగంలోకి దిగబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ ప్రెస్టీజియస్ మూవీ '' సినిమాలో ఆమె ఎంట్రీ ఉటుందట. ఈ సినిమాలో ఎంతో కీలకమైన రోల్ కోసం రీసెంట్‌గా ఈ చిత్ర దర్శకుడు జయప్రదను సంప్రదించగా ఆమె ఓకే చెప్పి కొన్ని డేట్స్ కూడా ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈ ఇష్యూపై ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా రూపొందనున్న 'బంగార్రాజు' సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు రావాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో 'బంగార్రాజు' పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున ఇప్పుడు అదే టైటిల్‌తో రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అతి త్వరలో సినిమాను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. స్క్రిప్ట్‌కి మెరుగులు దిద్ది ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొత్తం ఫినిష్ చేసిన దర్శకుడు.. నటీనటుల డేట్స్ తీసుకునే పనిలో ఉన్నారట. అయితే ఇప్పటికే 'బంగార్రాజు' మూవీ కోసం రమ్యకృష్ణను ఫైనల్ చేశారు. ఇప్పుడు జయప్రద రోల్ కూడా ఉంటుందని వార్తలు వస్తుండటం హాట్ టాపిక్ అయింది. నాగార్జున అత్త పాత్రలో ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో నాగార్జున తనయుడు నాగ చైతన్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషించనుండటం విశేషం. అంతేకాదు అఖిల్ కూడా భాగం కాబోతున్నాడని తెలుస్తోంది. సో.. ఇదంతా చూస్తుంటే చిత్రయూనిట్ స్పందిస్తే గానీ వీటన్నింటిపై ఓ క్లారిటీ వచ్చేలా లేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SZpxyX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...