Monday, 14 June 2021

19yearsofJayam : నటుడిగా 19 ఏళ్లు.. టీనేజ్ అండ్ అడల్ట్ ఏజ్ అంటూ నితిన్‌పై భార్య కొంటె కామెంట్స్

టాలీవుడ్ హీరో ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే చివరగా చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అయితే నితిన్‌కు అవి ఆశించినంతగా ఫలితాలను ఇవ్వలేదు. ఆ రెండు సినిమాలు బోల్తా కొట్టినా కూడా నితిన్ మాత్రం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోన్నారు. ఇప్పుడు వరుసబెట్టి సినిమాలను పట్టాలెక్కించారు. అయితే నితిన్ సినిమాతో రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. జయం సినిమా విడుదలై నేటికి 19ఏళ్లు. ఈ క్రమంలో నితిన్ భార్య షాలినీ కొంటె కామెంట్లు చేశారు. నితిన్ గత ఏడాది కరోనా సమయంలోనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు, ప్రేయసి అయిన షాలినీని నితిన్ వివాహాం చేసుకున్నారు. దుబాయ్‌లో వివాహాం చేసుకుందామనుకున్న నితిన్.. చివరకు హైద్రాబాద్‌లోనే అతి కొద్ది మంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. నితిన్ షాలిని తమ హనీమూన్‌ను దుబాయ్‌లోనే కానిచ్చేశారు. రంగ్ దే సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట దుబాయ్‌లోనే ఎంజాయ్ చేశారు. నితిన్ భార్య షాలినీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నితిన్‌కు సంబంధించిన విషయాలన్నీ అప్డేట్ చేస్తుంటారు. అలా తాజాగా నితిన్ జయం సినిమాకు 19 ఏళ్లు నిండాయని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటి వరకు టీనేజ్ ఎంజాయ్ చేశారు.. ఇక ఇప్పటి నుంచి అడల్ట్ ఏజ్‌ను ఎంజాయ్ చేయాలి..నువ్ ఎంతో మందిలో స్ఫూర్తినింపావు. ఇక మున్ముందు రోజుల్లో మంచి జరగాలని ఆశిస్తున్నాని అన్నారు. నితిన్ ప్రస్తుతం అంధాదున్ రీమేక్‌లో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RUD8Hi
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...