Saturday, 1 May 2021

SSMB28.. వీడియోతోనే అదరగొట్టేశారు.. మహేష్ త్రివిక్రమ్ క్రేజీ కాంబో!

సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో ఆధిపత్యం కనబరుస్తుంటారో అందరికీ తెలిసిందే. తెలుగు హీరోల్లో సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారిలో మహేష్ బాబు ముందుంటారు. అలా సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ప్రతీ విషయం వైరల్ అవుతుంటుంది. అలాంటిది మహేష్ బాబు కాంబోలో రాబోతోన్న సినిమా ట్రెండ్ అవ్వకుండా ఉంటుందా? నేటి ఉదయం నుంచి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూనే ఉంది. నేటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు అధికారిక ప్రకటన ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ చేసిన ఈ ట్వీట్‌తో అందరూ ఖుషీ అయ్యారు. కానీ తీరా సమయానికి వచ్చే సరికి షాక్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోందని, మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ప్రకటన ఉంటుందని, అయినా అదేంటో కూడా మీకు తెలుసు అని ట్వీట్ చేసింది. అయితే తాజాగా వదిలిన ఓ వీడియోతో అధికారికంగా ప్రకటించేశారు. అతడు, ఖలేజా నాటి రోజులను గుర్తుకు చేశారు. 11 ఏళ్ల తరువాత మళ్లీ ఈ కాంబో సెట్ అయిందంటూ అంచనాలు పెంచేశారు. ఈ వీడియోలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మొత్తానికి మాటల మాంత్రికుడు మాయజాలం మళ్లీ మహేష్ బాబును కొత్త అవతారంలో చూపించబోతోందన్న మాట. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gS9g8m
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...