Saturday, 1 May 2021

నాలుగు పదులు దాటినా కూడా తగ్గని వాడి వేడి.. సురేఖా వాణి వీడియో వైరల్

టాలీవుడ్ నటి సురేఖా వాణికి సోషల్ మీడియాలో అంతులేని క్రేజ్ ఉంది. ఈ మధ్య ఎక్కువగా వెండితెరపై కనిపించకపోయినా ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అలా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ తనకంటూ ఓ ప్రత్యేక అభిమాన గణాన్ని ఏర్పర్చుకున్నారు. మొన్న సురేఖా వాణి బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియా షేక్ అయిపోయింది. సురేఖా వాణి తన కూతురు సుప్రిత కలిసి చేసే హల్చల్ మామూలుగా ఉండదు. ఎలాంటి ప్రత్యేక రోజులు లేనప్పుడే ఈ ఇద్దరూ కలిసి దుమ్ములేపుతుంటారు. అలాంటి సురేఖా వాణి తన బర్త్ డేను ఏ రేంజ్‌లో సెలెబ్రేట్ చేసుకుంటుందో ఊహించుకోవచ్చు. అనుకున్నట్టుగానే సురేఖా వాణి అందరికీ షాక్ ఇచ్చారు. కూతురు, ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి సురేఖా వాణి తన పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నారు. 40వ పుట్టినరోజు వేడుకలు అంటూ సురేఖా వాణి బర్త్ డే పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేశాయి. అందంలో కూతురితో పోటీ పడుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె వేసుకున్న పొట్టి బట్టలు, అందులోని అందాల ప్రదర్శన చూసి అంతా షాక్ అయ్యారు. బర్త్ డే ముగిసిపోయినా కూడా హడావిడి మాత్రం తగ్గలేదు. బర్త్ డే సెలెబ్రేషన్స్ తరువాత సురేఖా వాణి షేర్ చేసిన వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పొట్టి బట్టల్లో చిన్నపిల్లలా వేసిన గెంతులు, చేసిన అల్లరి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇక ఆమె షేర్ చేసిన వీడియోలో హీరోయిన్‌కు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌ను ఒలకబోశారు. బర్త్ డే వైబ్స్ అంటూ షేర్ చేసిన వీడియోను చూసి నెట్టిళ్లు షాక్ అవుతుంది. వయసు అనేది కేవలం నంబర్, అదిరిపోయింది.. నలభై ఏళ్ల అమ్మాయి అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులో ఇది అవసరమా? అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eGz7NY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...