Thursday, 27 May 2021

Rashmi Gautam: హైపర్ ఆదికి బంపర్ ఆఫర్.. ప్రియమణి ముందే హగ్గులతో రచ్చ.. సుధీర్ మాటలకు అమ్మడు షాక్

ఈ రోజుల్లో వెండితెర హంగామా ఎంత ఉందో బుల్లితెర హవా కూడా అదే రేంజ్‌లో కనిపిస్తోంది. పైగా కరోనా కారణంగా సిల్వర్ స్క్రీన్స్ బోసిపోవడంతో ప్రతి ఇంట ఉన్న బుల్లితెరలకు డిమాండ్ పెరిగింది. దీంతో పలు ప్రోగ్రామ్స్ ద్వారా వినోదం పంచుతూ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి టీవీ ఛానెల్స్. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోగ్రాంలో , సుడిగాలి సుధీర్, హంగామా కనిపించింది. అప్పుడు ఇప్పుడు అని కాదు ఎప్పుడైనా బుల్లితెరపై హైపర్ ఆది కామెడీ టైమింగ్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు. ఇదొక్కటే కాదు తోటి యాంకర్స్, నటులతో రొమాన్స్ పండించడంలోనూ మనోడు దిట్ట. అవకాశం దొరికిన ప్రతిసారి అందమైన అమ్మాయితో రొమాంటిక్ డ్యూయెట్స్ వేసే ఆది.. తాజాగా విడుదలైన ప్రోమోలో దీపిక కౌగిలిలో పరవశించిపోవడం హైలైట్ అయింది. ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న ఈ షోలో తనదైన ఎనర్జీతో ఇద్దరు డాన్సర్లను ఎత్తుకొని మరీ డాన్స్ చేస్తూ ఛాలెంజింగ్ ఫీట్ చేశాడు హైపర్ ఆది. అయితే ఇదంతా చేసింది రష్మీ ఇచ్చిన ఆఫర్ కోసమే. మీరు ఆ ఇద్దరినీ ఎత్తుకొని కరెక్టుగా డాన్స్ చేస్తే దీపిక వచ్చి హగ్గిస్తుంది మీకు అని రష్మీ చెప్పడంతో హైపర్ ఆది వెంటనే ప్రొసీడ్ అయ్యాడు. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ ఎంటరై హైపర్ ఆది పని ఫినిష్ చేశాడు కాబట్టి దీపిక హగ్ ఇవ్వాల్సిందే లేదంనే నేను రష్మీకి హగ్ ఇస్తా అన్నాడు. దీంతో రష్మీ షాకైంది. వెంటనే దీపిక వెళ్లి హైపర్ ఆదికి హగ్ ఇవ్వడంతో మనోడు ఊహాలోకంలోకి వెళ్లి పోయాడు. ఇదంతా ప్రియమణి ముందే జరగడంతో అక్కడున్న జడ్జెస్ ఈ రొమాంటిక్ మూమెంట్స్ చూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wPQJP5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...