Wednesday, 26 May 2021

NKR18 అప్డేట్.. సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్

నందమూరి సరైన హిట్ కొట్టలేక రేసులో కాస్త వెనకబడ్డారు. పటాస్ తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ చవిచూడలేకపోయారు. చివరగా ఎంత మంచివాడవురా అనే సినిమాతో లక్ పరీక్షించుకున్నారు. కానీ అది కూడా అంతగా వర్కవుట్ కాలేదు. అయితే కళ్యాణ్ రామ్ నటనకు, ప్రయత్నానికి మంచి మార్కులు పడ్డాయి. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ మళ్లీ తన కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ నిర్మాతగా మాత్రం భారీ ప్లాన్‌లతో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. హీరోగా రాబోతోన్న సినిమాల్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రాబోతోన్న సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా ఉన్నారు. అలా ఓ వైపు నిర్మాతగా బిజీగా ఉంటూనే హీరోగానూ తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్నో సర్ ప్రైజ్‌లు రెడీగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తన 18వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతోన్నట్టు కళ్యాణ్ రామ్ తెలిపారు. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్‌కు గేమ్ చేంజర్ లాంటి సినిమా అని తెలుస్తోంది. మొదటిసారిగా సోషియో ఫాంటసీతో కళ్యాణ్ రామ్ రాబోతోన్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ మే 28న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతోన్నట్టు మేకర్స్ ప్రకటించారు. గత ఏడాదే షూటింగ్ మొదలైందని, టీం మొత్తం సెలైంట్‌గా తమ పని తాము చేసుకుంటూ పోయారని ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన వివరాలు ప్రకటిస్తామని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oTNtiU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...