Wednesday, 26 May 2021

నావి దొంగతనం చేయకండి.. నటుడిపై సమంత కామెంట్స్

సమంత, మనోజ్ భాజ్ పేయి, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ చుట్టూ ఎన్నిరకాల కాంట్రవర్సీలు చుట్టుముడుతున్నాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వం, అక్కడి ప్రజలు ఈ వెబ్ సిరీస్‌ను నిషేధించాలని కేంద్రాన్ని కోరింది. ఎల్‌టీటీఈని టార్గెట్ చేస్తూ ఈ సిరీస్‌లో సన్నివేశాలున్నాయని, తమిళ నటి టెర్రరిస్ట్‌గా నటించడంపైనా అభ్యంతరం వ్యక్తంచేశారు. అలా సీజన్ 2 మీద కాంట్రవర్సీలు వస్తున్నా కూడా చిత్రయూనిట్ మాత్రం ముందకు వెళ్తోంది. జూన్ 4న అమెజాన్ ప్రైమ్‌లో అందుబాబులోకి వస్తుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను పెంచింది. ఇందులో భాగంగా మనోజ్ భాజ్ పెయ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. సమంత అంకితభావం, పనితీరు మీద కామెంట్ చేశారు. సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడంతో ఎంతో ఎనర్జీ వచ్చినట్టు అయిందని అన్నారు. చెన్నైలో నేను షూటింగ్ కోసం అడుగుపెట్టేసరికి సమంత అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు.. ఫిజికల్‌గానూ ట్రైన్ అయి ఉన్నారు.. అయితే నాకు భయం వేసింది.. ఆమె అంతలా ప్రిపేర్ అయి ఉన్నారు.. నేను మాత్రం ఇంకా ఏమీ మొదలుపెట్టలేదు.. మళ్లీ నేను రిహార్సల్ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నాను అని మనోజ్ భాజ్ పేయ్ అన్నారు. అలా తన మీద చేసిన కామెంట్ల సమంత స్పందించారు. అవన్నీ నా మాటలే.. అవి మీరు కాపీ కొడుతున్నారు. మీరు గొప్ప నటులు.. ఫ్యామిలీ మెన్ సీజన్‌2లో మీరు ఎంత అద్భుతంగా నటించారో, మీరు ఏం చేశారో అందరూ చూడాల్సిందే. ఆక్షణం కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని సమంత చెప్పుకొచ్చారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3foQvs6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...