తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ దర్శకులు, టాలీవుడ్ సినీ రారాజు దర్శకేంద్రుడు ఈ రోజు (మే 23). టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు రూపొందించిన ఘనత ఆయన సొంతం. శతాధిక చిత్రాల దర్శకుడిగా కీర్తించబడుతున్న ఆయన ఒక్కో సినిమా ఒక్కో కళాఖండం. హీరోహీరోయిన్ల నటనా ప్రతిభను వెలికితీస్తూ ప్రేక్షకులను ఆకరించడంలో ఆయన మహా దిట్ట. ఇక రాఘవేంద్రుడి పాటల హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లను గ్లామర్‌గా చూపిస్తూ మైమరిపించడం ఆయన స్టైల్. పండ్లు, పూలు విసురుతూ నవరసాలు పండించి ఎంతోమంది హీరోయిన్లను స్టార్స్ చేశారు రాఘవేంద్ర రావు. అలాంటి దిగ్గజ దర్శకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మెగాస్టార్ ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకేంద్రుడిపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టారు. ''రాఘవేంద్రరావు సినీప్రస్థానంలో అత్యధిక చిత్రాల కథానాయకుడిగా నాకు ఓ ప్రత్యేకత లభించింది. ఆ రకంగా మా కాంబినేషన్ ఎంతో స్పెషల్. నా స్టార్‌డమ్‌ను, కమర్షియల్ స్థాయిని పెంచాడీ దర్శకుడు. తెలుగు చిత్రాల్లో ఎప్పటికీ అపురూపంగా నిలిచే జగదేకవీరుడు.. లాంటి చిత్రాన్ని నాకు కానుకగా ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను'' అంటూ చిరంజీవి ట్వీట్ పెట్టారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SdRm5P
v
No comments:
Post a Comment