Monday, 24 May 2021

Gలో దమ్ము అంటూ అలీ రెజా హల్చల్.. బర్త్ డే నాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ హంగామా!

బిగ్ బాస్ ఫేమ్ ఇప్పుడు రూట్ మార్చేశారు. బుల్లితెరపై సీరియల్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అలీ రెజా వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. బిగ్ బాస్ షోతో అలీ రెజా స్టార్డం మారిపోయింది. సోషల్ మీడియాలో అలీ రెజాకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అకస్మాత్తుగా ఎలిమినేట్ అవ్వడం, మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం, టాప్ 5లో ప్లేస్ సంపాదించుకోవడం ఇలా అలీ రెజాకు బిగ్ బాస్ షోతో ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ షో ద్వారానే సినిమాలో అవకాశం వచ్చింది. నాగార్జున రికమండ్ చేయడంతో ఫుల్ లెంగ్త్ రోల్ వచ్చేసింది. అలా వెండితెరపై అలీరెజాకు మంచి కమ్ బ్యాక్ చిత్రంగా నిలిచింది. అంతకుముందు ధృవ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలీ రెజా కనిపించారు. ఆ తరువాత మళ్లీ వైల్డ్ డాగ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద కనిపించారు. అయితే తాజాగా అలీ రెజా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు తన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఖాజా భాయ్ అంటూ తన కొత్త సినిమా విశేషాలను చెప్పుకొచ్చారు. G.D G లో దమ్ము G అంటే గుండె అని చెప్పుకొచ్చారు. జీడీ ఉన్న దోస్త్ ఖాజా భాయ్‌ను కలవండి అంటూ ఫస్ట్ లుక్ షేర్ చేశారు. ఈడు ఎవని అయ్యకు వినడు.. దోస్తులకు తప్పా అంటూ చెప్పుకొచ్చారు. ఖాజా భాయ్‌కి కూడా తెలీదు ఈ ప్రయాణం ఇంత కొత్తగా ఉంటుందని, మిక్ మూవీస్, ఖారాబూందీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తోందని తెలిపారు. జీడీ ఉన్న దోస్తులందరి కోసం ఈ ఫస్ట్ లుక్ అని అలీ రెజా అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3oNG44C
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...