Monday, 24 May 2021

తినడమైతే మానేయడం లేదుగా.. నెగెటివ్ కామెంట్లపై సింగర్ కౌసల్య కౌంటర్

ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితులో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనాతో ప్రజలు అల్లాడిపోతోన్నారు. ఎటు చూసినా ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. సరిగ్గా వైద్యం అందక, ఆక్సిజన్ కొరత, ఐసీయూ బెడ్స్ లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. రోజుకూ కొన్ని లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. వేల మంది ప్రాణాలు కోల్పోతోన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. లాక్డౌన్, కర్ఫ్యూలను అమలు పరుస్తున్నారు. ఇలా దేశం, రాష్ట్రాలు అన్నీ కూడా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు సెలెబ్రిటీలు తమకు చేతనైన సాయాన్ని చేస్తున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమకు వీలైనంతలో సాయపడుతున్నారు. కొందరు మాటలతో, ఇంకొందరు చేతలతో, మరికొందరు పాటలతో సాయం చేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి కాస్తైన రిలాక్స్ అయ్యేందుకు సునీత లాంటి వాళ్లు పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అలా తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఓ పాటను పాడి, దాన్ని ఎడిట్ చేసి మరీ ఫేస్ బుక్‌, ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ వీడియోపై కొన్ని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. వాటిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. బాగుంది కానీ ఇది ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టైం కాదు.. రోజుకు ఎంత మంది చనిపోతోన్నారో తెలుసా?.. కానీ మనం చేయలేకపోతోన్నాం.. కనీసం ఇలాంటి సమయంలో మన సంతోషాన్ని ఎదుటివారికి చూపించకుండా ఉండాలి అని అన్నాడు. దానికి కౌసల్య కౌంటర్‌గా.. ఇలాంటి కష్టమొచ్చింది కదా అని నాకు తెలిసి మీరు తినడమైతే మానయలేదు.. మా లాంటి వారికి సంగీతమే అన్నం పెడుతుంది అని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bObRgv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...