Friday, 14 May 2021

Eid Mubarak 2021: ఉపవాస దీక్షలో దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం.. ముస్లిం సోదరులకు బాలయ్య స్పెషల్ విషెస్

ఈ రోజు (మే 14) ముస్లింలకు పవిత్ర పండగ అయిన పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, స్టార్ హీరో స్పెషల్ విషెస్ చెప్పారు. ఓ వీడియో ద్వారా సందేశమిచ్చిన ఆయన.. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ దైర్యంగా ఉండాలని కోరారు. ''ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పవిత్ర పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవా నిరతికి మారు పేరు రంజాన్ పవిత్ర మాసం. ఎంతో భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపా కటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సమస్త మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ.. మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకంక్షలు తెలియచేసుకుంటూ.. మీ బాలకృష్ణ'' అని ఆయన అన్నారు. మరోవైపు ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు బాలకృష్ణ రంగంలోకి దిగారు. కరోనా బాధితుల కోసం ఆయన తక్షణ సహాయం అందించారు. హిందూపురం కరోనా బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ కిట్లను ఆయన అందజేశారు. ప్రస్తుతం బోయాపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ' సినిమాలో బాలకృష్ణ నటిస్తున్నారు. ''సింహ, లెజెండ్'' సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RTpsfn
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...