Friday, 14 May 2021

అనుష్కను అలా చూసి కంగారు పడుతున్న ఫ్యాన్స్.. లెక్కలేనన్ని డౌట్స్! ఇదీ అసలు మ్యాటర్..

గత 15 ఏళ్ల క్రిందట 'సూపర్' సినిమాతో పరిచయమై టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది అనుష్క. సౌత్ ఇండియన్ తెరపై తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ 'బాహుబలి' సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్ అయింది. అయితే ఆ తర్వాత కాస్త సినిమాల వేగం తగ్గించిన ఆమె.. ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. రీసెంట్‌గా ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడమే గాక పలు అనుమానాలకు తావిచ్చింది. ఆ ఫొటోలో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తూ ఉండడంతో జనాల్లో ఆసక్తికర చర్చ షురూ అయింది. గతేడాది విడుదలైన ‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క ఏ ప్రాజెక్ట్‌లోనూ కనిపించకపోవడంతో ఆమె ఇక సినిమాల్లో నటిస్తుందా? లేదా అనే డౌట్స్ వస్తున్న నేపథ్యంలో అనుష్క ఇలా బొద్దుగా కనిపించడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. నిశ్శబ్దం సినిమాలో ఉన్న దానికంటే బాగా బరువు పెరిగి బుగ్గలు కూడా బాగా పెంచేసి ఆమె దర్శనమిచ్చింది. దీంతో అనుష్క ఇలా మారిందంటే ఇక సినిమాల్లో నటించదేమో.. పెళ్లి చేసుకొని సెటిలై పోతుందేమో అనే ఊహాగానాలు తెరపైకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులు ఆ ఫొటో గురించి చిన్న క్లారిటీ ఇస్తున్నారు. అది గతేడాది దిగిన ఫొటో అని చెబుతూ పోస్టులు పెడుతున్నారు. డిసెంబర్‌ నెలలో అనుష్క హరిద్వార్‌ని సందర్శించారని.. అక్కడి స్వామిజీతో ఫొటోలు దిగారని, అదే ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిందని అంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అనుష్క ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారని చెబుతున్నారు. ‘నిశ్శబ్దం’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క.. జాతిరత్నాలు ఫేమ్ నవీన్‌ పొలిశెట్టితో ఓ ప్రేమకథా సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో అనుష్క పెళ్లి మ్యాటర్ కూడా జనం నోళ్ళలో నానుతోంది. ఆమె తల్లిదండ్రులు అనుష్క పెళ్లిపై ఫోకస్ పెట్టారని, ఇందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. సో.. చూడాలి మరి ఇంతకీ అనుష్క మళ్ళీ కెమెరా ముందుకొస్తుందా? లేక మూడు ముళ్ళ బంధంతో సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3bsPKvT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...