Monday, 24 May 2021

సోదరుడితో స్విమ్మింగ్ పూల్‌లో.. వీపు మీదకు ఎక్కి రకుల్ ప్రీత్ రచ్చ

సోషల్ మీడియాలో ఎంతలా హల్చల్ చేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. గత ఏడాది లాక్డౌన్‌లో రకుల్ ప్రీత్ ఆడిన ఆటలు, ఇంట్లో తన తమ్ముడితో చేసిన అల్లరి ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇంట్లోనే దిండ్లతో ఆటలు, పులుసాటలు ఆడుతూ రచ్చ చేశారు. రకుల్ ప్రీత్ తన సోదరుడు అమన్ ప్రీత్‌ని హీరోగానూ పరిచయం చేశారు. ఆ సినిమాకు రకుల్ ఎంతగానో మద్దతు ఇచ్చారు. తెలుగులో అంతగా క్లిక్ అవ్వలేకపోయారు. ఇక హిందీలోనూ నటించి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో , రకుల్ ఫోటోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ఆ మధ్య మాల్దీవుల్లో రకుల్ ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. తన పేరెంట్స్ పెళ్లి రోజును ఘనంగా సెలెబ్రేట్ చేసేందుకు రకుల్ ప్రీత్ మాల్దీవుల్లో ప్లాన్ వేశారు. అలా అక్కడ బికినీలో రకుల్ చేసిన రచ్చ, సోదరుడితో కలిసి బికినీలో దిగిన సెల్ఫీలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా రకుల్ మరో ఫోటోను షేర్ చేశారు. నేడు సోదరుల దినోత్సవం. ఈ సందర్బంగా తన సోదరుడిపై ఉన్న ప్రేమను రకుల్ బయటపెట్టేశారు. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడు అమన్‌కు హ్యాపీ బ్రదర్స్ డే. నువ్వంటే నాకు పిచ్చి.. నా సంతోషం, నా బలం, నా మోగ్లీ అన్నీ నువ్వే.. లవ్యూ అంటూ రకుల్ ప్రీత్ ఓ ఫోటోను షేర్ చేశారు. ఇందులో తమ్ముడితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తమ్ముడి వీపుపై ఎక్కి షికార్లు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QOVYPy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...