Monday, 24 May 2021

వాటిని అవసరం ఉన్న వారికి ఇవ్వండి.. పాలాభిషేకంపై సోనూ సూద్ కామెంట్

మనస్తత్వం గురించి ఈపాటికే అందరికీ అర్థమై ఉండాల్సింది. వీలైతే పది మందికి సాయం చేయండి.. సాయ పడండి అంటాడు తప్పా తన కోసం ఏదైనా చేయండి అని అడిగేవారు కాదు. తనకు పాలాభిషేకం చేసేందుకు ఉపయోగించే పాలపై సోనూ సూద్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సోనూ సూద్ బ్యాంక్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రామాల్లోని ప్రజలు సోనూ సూద్‌కు పూజలు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం సోనూ సూద్ చిత్రపటానికి, విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దీనిపై నటి కవితా కౌశిక్ స్పందించారు. ఈ చర్యను సోనూ సూద్ సైతం హర్షించరు.. పాలను వృథా చేయకండి అంటూ ఫైర్ అయ్యారు. ఆమె అన్నట్టుగానే సోనూ సూద్ తాజాగా స్పందించారు. తనకు పాలాభిషేకం చేస్తోన్న వీడియోలు సోషల్ మీడియాలోవైరల్ అవ్వడంతో సోనూ సూద్ రియాక్ట్ అయ్యారు. మీరు చూపించే ప్రేమకు ఎంతో రుణపడి ఉన్నాను. కానీ ఆ పాలను అవసరంలో ఉన్న వారికి కోసం వాడండి అని సవినయంగా కోరారు. దీంతో నెటిజన్లు సోనూ సూద్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆక్సిజన్ కావాలని అడిగిన ప్రతీ ఒక్కరికీ క్షణాల్లో డెలివరీ చేస్తున్నారు. చివరకు జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వాలు కూడా సోనూ సూద్ సాయాన్ని తీసుకుంటున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సోనూ సూద్ గత ఏడాది నుంచి నిర్విరామంగా దేశ ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలోనే ఉంటున్నారు. తన ఇంటికి వచ్చి గోడును వెల్లగక్కుంటున్నవారి బాధలను సోనూ సూద్ వింటున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3494Brg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...