Sunday, 9 May 2021

వాటికి ప్రతిరూపం, అపురూపం నువ్వే.. ముద్దుముద్దు మాటలతో అలా.. రేణూ దేశాయ్‌పై ఆద్య కామెంట్స్

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆమె ఎక్కువగా తన పిల్లల గురించి చెబుతుంటారు. ఆద్య, అకీరా నందన్‌ల గురించి, వారి అలవాట్లు, అల్లరి గురించి అభిమానులకు అప్డేట్లు ఇస్తుంటారు. అకీరా ఎంత సైలెంట్‌గా ఉంటారో.. అంతగా అల్లరి చేస్తుంటారని రేణూ దేశాయ్ చెబుతుంటారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ బుల్లితెర మీద హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. డ్రామా జూనియర్స్ షోలో రేణూ దేశాయ్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మదర్స్ డే స్పెషల్‌గా నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఆద్య స్పెషల్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు వదిలిన ప్రోమోలు ఓ రేంజ్‌లో హల్చల్ చేశాయి. తన తల్లి ఎంతో గొప్పదని ఆద్య ముద్దుగా చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా అమ్మ కోసం పాట కూడా పాడేశారు ఆద్య. ఇక యాంకర్ రవిని తాత అంటూ మరో పంచ్ వేశారు ఆద్య. ఇలా మొదటి సారి తెరపై కనిపించిన ఆద్య అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతైనా పవర్ స్టార్ కూతురు కదా? అని అందరితో అనిపించుకున్నారు. ఇక ఇప్పుడు తన తల్లి గురించి ఆద్య చెప్పిన కవిత్వం అందరినీ ఆకట్టుకుంటోంది. అమ్మ.. నాకున్న బలం.. నాలోని ధైర్యం.. అమ్మ.. నన్ను నడిపించిన నమ్మకం.. నా నవ్వుకు కారణం.. అమ్మ.. ఓర్పుకు ప్రతిరూపం.. నీ ప్రేమ అపురూపం... నువ్ గొప్ప తల్లివి అమ్మా.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అలా ఆద్య తన తల్లికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఇదే విషయాన్ని రేణూ దేశాయ్ చెబుతూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పొద్దు పొద్దున్నే ఆద్య ఇలా నాకు సర్ ప్రైజ్ ఇచ్చిందంటూ వీడియోను షేర్ చేశారు. ఆద్య ముద్దు ముద్దు మాటలు అందరినీ కట్టిపడేస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uKx1nf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...