Wednesday, 5 May 2021

కరోనా *** మీద తన్నేశా.. పూజా హెగ్డే సెన్సేషనల్ కామెంట్స్

టాలీవుడ్ బుట్టబొమ్మ కరోనాను జయించారు. ఏప్రిల్ 25న తాను బారిన పడ్డానని, పాజిటివ్ వచ్చిందని పూజా హెగ్డే ప్రకటించారు. స్వల్ప లక్షణాలున్నాయని చెబుతూ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని, తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని పూజా హెగ్డే సలహా ఇచ్చారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. అయితే దాదాపు వారం, పది రోజుల తరువాత పూజా హెగ్డే కరోనా నుంచి కోలుకున్నారు. ఇదే విషయాన్ని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఊరికే నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, కరోనా నుంచి కోలుకున్నానని చెబితే ఇంతగా పూజా హెగ్డే ట్రెండ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ట్వీట్ చేసిన విధానం, అందులో మాట్లాడిన మాటలు,కరోనా మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్‌లో ఏముందో ఓ సారి చూద్దాం. మీరు నాపై చూపించిన ప్రేమ, పంచిన ప్రేమకు థ్యాంక్స్. నేను మొత్తానికి కోలుకున్నాను.. స్టుపిడ్ కరోనా బట్ మీద తన్నేశాను.. నెగెటివ్ అని రిజల్ట్ వచ్చింది.. మీరు ఇచ్చిన సహకారం, ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది.. ఈ అద్భుతం జరగడానికి కారణం మీరే.. మీకు ఎల్లప్పుడూ రుణపడే ఉంటాను.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం, దళపతి విజయ్‌తో చేయబోతోన్న చిత్రాల కోసం పూజా హెగ్డే ఎదురుచూస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33ioKdS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...