Wednesday, 5 May 2021

ట్రైన్‌లో చేదు అనుభవం.. బాత్రూం వద్ద పట్టుకుని.. గుట్టు విప్పిన సీనియర్ నటి రజిత

సీనియర్ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నేటి తరం ప్రేక్షకులకు ఆమె ఓ హాస్య నటిగా సుపరిచితురాలు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే ఆమె ఒకప్పుడు హీరో చెల్లిలిగా, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల్లో మెప్పించారు. ఇప్పుడు రజిత అనే షోకు అతిథిగా విచ్చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. రజితతో పాటు సురేఖా వాణి కూడా ఈ షోలో సందడి చేశారు. మామూలుగా అయితే సురేఖా వాణి, రజితలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటారు. ఈ ఇద్దరూ కలిసి సీనియర్ నటీనటులంతా పార్టీలు చేసుకుంటారు. అలా ఇప్పుడు ఈ ఇద్దరూ అలీతో ముచ్చట్లు పెట్టేందుకు వచ్చారు. ఈక్రమంలో రజిత తనకు జరిగిన చేదు అనుభవం గురించి వివరించారు. రజితను ఓ సారి అభిమాని ఆశ్చర్యానికి గురి చేశాడట. కట్టప్ప బాహుబలి స్టైల్లో తన కాలిని తీసుకుని నెత్తిన పెట్టేసుకున్నాడని రజిత చెప్పుకొచ్చారు. ఓ అభిమాని వచ్చాడు.. కాళ్లకు మొక్కుతున్నాడేమో అని అనుకున్నాను. కానీ నా కాలిని తీసుకుని నెత్తిన పెట్టేసుకున్నాడని చెబుతూ నవ్వులు పూయించారు రజిత. రజిత పెళ్లి గురించి ఓ సెటైర్ వేశారు. ఈ మధ్యే ఆన్ లైన్‌లో పెళ్లి చూపులు జరిగాయ్ తెలుసా? అంటూ అలీ అసలు విషయం బయట పెట్టేశారు. అయితే ఆయన ఎవరో చూస్తారా? అంటూ ప్రేక్షకులను ఊరించారు. ఇంకో విషయం చెబుతూ రజిత సీనియార్టీ మీద సెటైర్లు వేశారు అలీ. ట్రైన్ ప్రయాణం ఎందుకు అంత భయం అంటూ అలీ అడగ్గా రజిత అసలు విషయంచెప్పారు. ఓసారి ట్రైన్‌లో ప్రయాణం చేస్తుండగా.. బాత్రూం నుంచి బయటకు వచ్చాను.. అక్కడ ఓ వ్యక్తి నన్ను పట్టుకుని కౌగిలించుకుని, ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ట్రైన్‌లో అరిచినా కూడా వినబడలేదు. అప్పటి నుంచి రైళ్లో ప్రయాణించాలంటే భయం అని అసలు సంగతిని చెప్పేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xHJkm5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...