Saturday, 15 May 2021

టుడే ఇన్‌స్టా హిట్స్: అవసరాల వెరైటీ మాస్క్.. వండర్ వుమెన్‌గా విష్ణుప్రియ.. సిగ్గు పడుతున్న నబా

మాస్క్ అందరికీ ‘అవసర’మే.. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నుంచి దూరంగా ఉండాలంటే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు, దర్శకుడు ఓ వైరైటీ మాస్క్ ధరించి.. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలంటూ సందేశం ఇచ్చారు. ఈ పాండమిక్ సమయంలో మాస్క్ ధరించక పోవడం అంటే సాహసం చేసినట్లే అని ఆయన పేర్కొన్నారు. రామ్‌‌ని మిస్ అవుతున్న ఛార్మి చాక్లెట్ బాయ్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు రామ్ పోతినేని. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రామ్ శనివారం (మే 15)న తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి ఛార్మి.. రామ్‌కు తనదైన స్టైల్‌లో విషెస్ తెలిపింది. పూరీ జగన్నాథ్, తను కలిసి రామ్‌తో దిగిన ఫోటో షేర్ చేసిన ఛార్మి.. రామ్‌ని ఎంతో మిస్ అవుతున్నా అంటూ పేర్కొంది. విష్ణు @ వండర్ వుమెన్ యాంకర్, నటి సోషల్‌మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ హాట్ ఫోటోషూట్‌లు చూస్తే.. ఆ ఫోటోలను ఫాలోవర్లతో పంచుకుంటుంది. తాజాగా బ్లాక్ టాప్‌లో చేసిన ఫోటోషూట్ పిక్స్‌ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే విష్ణుప్రియ వండర్ వుమెన్‌గా తనని ఎడిట్ చేసిన పిక్‌ని షేర్ చేసింది. ఈ ఫోటోని చూసి తాను ఎంతో సంతోషించానని.. ఇంత మంచిగా ఎడిట్ చేసిన సదరు వ్యక్తికి ఆమె థాంక్స్ చెప్పింది. ఇస్మార్ట్ బ్యూటీ.. సిగ్గు పడుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ నబా నటేశ్. సినిమాలతో పాటు సోషల్‌మీడియాలో ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా కాస్త సిగ్గుపడుతూ.. దిగిన ఓ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లిరోజున భార్యకి విషెస్ చెప్పిన నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటుడు నిఖిల్. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఏడాది లాక్‌డౌన్ సమయంలో నిఖిల్ వివాహం చేసుకున్నాడు. అయితే తన వివాహం జరిగి ఏడాది అయిన సందర్భంగా తన భార్య పల్లవికి శుభాకాంక్షలు చెబుతూ.. నిఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tMUTF9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...