Monday, 10 May 2021

మొన్న ట్విట్టర్.. నేడు ఇన్‌స్టాగ్రామ్.. కంగనా రనౌత్‌కు షాక్‌ మీద షాక్!

ప్రముఖ బాలీవుడ్ నటి ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వివాదాలతోనే బిజీగా ఉంటుంది. గత కొంతకాలంగా అమె సోషల్‌మీడియాలో పోస్ట్‌లతో రచ్చ చేస్తోంది. ఎక్కువశాతం దేశ రాజకీయాలపై ఆమె పోస్ట్‌లు చేయడం దానికి నెటిజన్లు కౌంటర్లు ఇవ్వడం.. జరుగుతుంది. ఇక కొద్ది రోజుల క్రితం వచ్చిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కంగనా చేసిన వరుస ట్వీట్లు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ విజయంపై ఆమె వ్యతిరేకంగా ట్వీట్ చేసింది. ఇందలో కొన్ని అభ్యంతరకర, హింసప్రేరేపిత ట్వీట్లు ఉండటంతో ట్విట్టర్ ఆమె ఖాతాను శాశ్వతంగా తొలగించింది. అయితే తాజాగా కూడా కంగనాకు షాక్ ఇచ్చింది. ఈ మధ్యే కంగనాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. ఇందులో కరోనా తన శరీరంలో పార్టీ చేసుకుంటుందని.. దాన్ని త్వరలోనే అంతం చేస్తానని ఆమె పేర్కొంది. దీని తాను యోగా చేస్తున్న ఫోటోని కూడా ఆమె జత చేసింది. దీంతో పాటు కోవిడ్ అనేది ఒక చిన్న ఫ్లూ మాత్రమే అంటూ ఆమె పేర్కొంది. ఈ క్రమంలో ఆమెపై విమర్శలు వచ్చాయి. ప్రతీ రోజు దాదాపు 4వేల మంది ప్రాణాలు బలిగొంటున్న కరోనా గురించి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు కంగనా చేసిన ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. ఈ విషయాన్ని కంగనా స్టోరీ ద్వారా వెల్లడించింది. ‘‘కోవిడ్‌ను నేను నాశనం చేస్తాను అంటూ పోస్ట్ చేస్తే కొందరు హర్ట్ అయ్యారట. అందుకే ఇన్‌స్టాగ్రామ్ నా పోస్ట్‌ని తొలగించింది. ఇప్పటివరకూ టెర్రరిస్టులకు, కమ్యూనిస్టులకు మద్దతుదారులు ఉంటారని ట్విట్టర్‌లో విన్నాను. కానీ, ఇక్కడ కోవిడ్ ఫ్యాన్ క్లబ్ ఉంది. అద్భుతం. ఇన్‌స్టాకి వచ్చి కొన్ని రోజులే అవుతుంది. కానీ, ఇక్కడ ఇంకో వారానికి మించి ఉంటానని నాకు అనిపించడం లేదు’’ అంటూ కంగనా పోస్ట్ చేసింది. ఇక కంగనా నటించిన తాజా చిత్రం ‘తలైవి’ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eAj4m9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...