Monday, 10 May 2021

సలార్ నుంచి సాలిడ్ అప్‌డేట్.. మరోసారి అలా కనిపించనున్న ప్రభాస్!

‘కే.జీ.ఎఫ్ ఛాప్టర్-1’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు . ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనుల్లో అతను బిజీగా ఉన్నాడు. మొదటి ఛాప్టర్ కంటే భారీ రేంజ్‌లో రెండో ఛాప్టర్‌ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ అంచనాలను తారాస్థాయిలో పెంచేసింది. ఇక ఈ సినిమా తర్వాత అతను రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై చాలా రోజులు అయింది. కానీ, ఈ సినిమా నుంచి పోస్టర్లు తప్ప.. ఎటువంటి సమాచారం లేదు. కాగా, ఈ సినిమా షెడ్యూల్ కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. అయితే ఈ సినిమాలో పాత్ర ఎలా ఉంటుంది.. ప్రశాంత్ నీల్ ప్రభాస్‌ని ఎలా చూపిస్తాడా అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నాడట. అదీ తండ్రి, కొడుకుల పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో బాహుబలి సినిమాలో ప్రభాస్ డ్యుయల్ రోల్‌లో కనిపించాడు. అయితే స్క్రీన్‌పై ఒకే సందర్భంలో రెండు పాత్రల్లో కనిపించడు. కానీ, సలార్‌లో ఒకేసారి స్క్రీన్‌పై ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఒకే సారి ప్రభాస్‌ను రెండు విభిన్నమైన గెటప్‌ల్లో చూడబోతున్నామన్నమాట. అదే జరిగితే ప్రభాస్ అభిమానులకు అది పండగే. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి బసుర్ సంగీతం అందిస్తున్నారు. ‘రాకీ భాయ్’ని మించిన పవర్‌ఫుల్ పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3hcSEIP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...