Saturday, 8 May 2021

బాలయ్య ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. ‘అఖండ’ నుంచి మరో సర్‌ప్రైజ్ ఎప్పుడంటే..

నందమూరి బాలకృష్ణ, కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే.. అది మాస్ ఆడియన్స్‌కి పండగే. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలో బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘’. ఈ సినిమాలో త్రిపాత్రాభినందం చేస్తున్నారు. అందులో ఓ ఆఘోర పాత్రలో ఆయన కనిపించనున్నారు. అయితే సినిమా ప్రకటిస్తూ.. ఓ టజీర్‌ని, టైటిల్ ప్రకటిస్తూ.. ఓ టీజర్‌ని వదిలారు చిత్ర యూనిట్. ఈ రెండూ ఆడియన్స్‌కి తెగ నచ్చేశాయి. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్‌లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ టీజర్లతో ఫుల్ ఖుషీలో ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ త్వరలో మరో సర్‌ప్రైజ్ ఇవ్వనుందట. ఈ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని.. మే 28న విడుదల చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ డేట్‌కి సినిమానే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ, కరోనా కారణంగా అంతరాయం ఏర్పడటంతో అది కుదరేదు. అందుకోసం ఆ రోజు సినిమా ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తున్నారు. ఇక ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నటి పూర్ణ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Q5zKbK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...