Saturday, 8 May 2021

నా బాడీలో వైరస్ పార్టీ చేసుకుంటుంది.. దాన్ని నాశనం చేస్తాను: కంగనా రనౌత్

రెండో దశలో సినీ రంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఈ మధ్యే శిల్పా శెట్టి కుటుంబం సభ్యులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. కరోనాను జయించేందుకు యోగా చేస్తున్నానని కంగనా ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ‘‘కొన్ని రోజులుగా కొంచెం నీరసంగా, కళ్లలో మంటగా ఉంటుంది. నేను హిమాచల్ వెళ్తామని అనుకున్నాను. కాబట్టి నేను టెస్ట్ చేయించుకుంటే.. అందులో రిపోర్టు పాజిటివ్ అని వచ్చింది. కాబట్టి నేను క్వారంటైన్‌లోకి వెళ్లాను. నా బాడీలో వైరస్ పార్టీ చేసుకుంటుందనే విషయం నాకు తెలియదు. కానీ, నేను దాన్ని నాశనం చేస్తాను. మీరు ఎంత భయపడితే.. అది మిమ్మల్ని మరింతగా భయపెడుతుంది. దానిపై మనం కలిసి పోరాటం చేయాలి. కోవిడ్-19 అనేది ఒక చిన్న ఫ్లూ మాత్రమే.. అందరి మనస్తత్వంతో ఆడుకుంటుంది.. దాన్ని అణిచేయాలి’’ అంటూ కంగనా పోస్ట్ చేసింది. కాగా, గత కొంతకాలంగా కంగనా ఏదో విషయంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమె చేస్తున్న పోస్టింగ్‌లు, ట్వీట్లు ఏదో ఒక కాంట్రవర్సీకి దారి తీస్తున్నాయి. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కంగనా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఈ ట్వీట్‌ను హింసప్రేరేపితంగా భావించిన ట్విట్టర్.. ఆమె ఖాతాని శాశ్వతంగా తొలగించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xYmaI0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...