Thursday, 27 May 2021

టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌కి అల్లు శిరీష్ లిప్ కిస్.. చేతులు అడ్డుపెట్టి అలా! రొమాంటిక్ పిక్ వైరల్

స్టార్ కిడ్ అయినా స్టార్ స్టేటస్ పట్టేయడంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో . ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా సంవత్సరాలు అయినా కెరీర్‌ని టర్న్ చేసే సరైన హిట్ మనోడి ఖాతాలో ఇప్పటిదాకా పడలేదు. దీంతో డిఫరెంట్ కథల వేటలో ఉన్న ఈ యంగ్ హీరో.. ABCD మూవీ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. టార్గెట్ పెట్టుకున్నట్లుగానే ఈ సారి ఓ వైవిధ్యభరితమైన కథాంశంతో తన ఆరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు బాడీ బిల్డింగ్ చేసేసి సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారిపోయాడు అల్లు శిరీష్. రీసెంట్‌గా ఈ సిక్స్ ప్యాక్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇంతలో తాజాగా ఓ యంగ్ హీరోయిన్‌తో అల్లు శిరీష్ అద్దం మాటున రొమాన్స్ చేస్తున్న ఓ పిక్ నెట్టింట వైరల్ అయింది. అయితే ఇది రియల్ లైఫ్ పిక్ అయితే కాదు.. ఆయన లేటెస్ట్ మూవీ నుంచి వదిలిన ప్రీ లుక్ పోస్టర్. ఇందులో యంగ్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌- శిరీష్ లిప్ కిస్ చేసుకుంటూ అది కనిపించకుండా చేతులు అడ్డం పెట్టారు. అల్లు శిరీష్ ఆరో సినిమాకు సంబంధించిన ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శిరీష్ జోడీగా నటిస్తోంది. మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. మే 30వ తేదీ అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. ఆ రోజే ఈ చిత్ర పూర్తి వివరాలు తెలియజేయనుంది టీమ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3yQccJx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...