Tuesday, 4 May 2021

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత

ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం కొనసాగుతుంటే మరోవైపు వరుసపెట్టి సినీ ప్రముఖుల మరణ వార్తలు వస్తుండటం ప్రేక్షకుల్లో ఆందోళన నింపుతోంది. కొంతమంది సినీ ప్రముఖులు కరోనాతో కన్నుమూస్తుండగా.. ఇంకొంతమంది అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడుస్తున్నారు. నేడు (మే 4) ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సతీమణి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అనిత నేటి ఉదయం మరణించినట్లు తెలిసింది. కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సతీమణి అనిత కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. వీరి కుమార్తె స్వాతి జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించారు. అనిత మరణవార్త తెలిసి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తమ తమ వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3f7d6bx
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...