Thursday, 6 May 2021

సప్తగిరి పెద్ద మనసు.. ఆపదలో ఉన్న దర్శకుడికి అండగా నిలిచిన యాక్టర్

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచింది. సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు అంతా కరోనా బారిన పడుతుండటం చూస్తున్నాం. అయితే ఈ ఆపత్కాల సమయంలో ఓ డైరెక్టర్‌కి అండగా నిలిచి గొప్ప మనసు చాటుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు సప్తగిరి. ఇప్పటికే సోనూసూద్, అక్షయ్ కుమార్, అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి తారలు ప్రజలకు సాయం చేస్తూ పలువురి ప్రశంసలందుకోగా.. తాజాగా హీరో, కమెడియన్ కూడా ఆ లిస్టులో చేరాడు. క‌రోనా సోకడంతో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకున్న ద‌ర్శ‌కుడు, ర‌చయిత నంద్యాల ర‌వికి సాయం అందించేందుకు ముందుకొచ్చాడు సప్తగిరి. ఇటీవల కరోనా బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఆయనకు త‌న వంతుగా రూ.ల‌క్ష సాయం అందించి మంచి మ‌న‌సును చాటుకున్నాడు స‌ప్త‌గిరి. నంద్యాల ర‌వి ఆసుపత్రి బిల్ 7 లక్షలు అయిందని, అయితే ఆ బిల్లు కట్టే స్థోమత ఆయన కుటుంబానికి లేకపోవడంతో పెద్ద మనసుతో లక్ష సాయం అందించాడు సప్తగిరి. నంద్యాల ర‌వికి కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) నుంచి కూడా కొంత సాయం అందిన‌ట్లు తెలిసింది. చిన్న నటుడైనా ఇలా దర్శకుడి కోసం ముందుకు రావడం చూసి ప్రేక్షకులు సప్తగిరిని అభినందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eUUzPr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...