Sunday, 16 May 2021

మొన్న రజనీ.. నేడు అమితాబ్.. కరోనా నుంచి రక్షణ కోసం ముందడుగు వేసిన బిగ్‌ బీ

రెండో దశలో కరోనా దేశవ్యాప్తంగా భయంకరంగా వ్యాపిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతంగా సాగుతోంది. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకొనేందుకు ఇప్పటికీ కొందరు భయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయనే అపోహ చాలా మందిలో ఉంది. ఈ అపోహను పొగొట్టేందుకు సెలబ్రిటీలు ప్రయత్నం చేస్తున్నారు. అర్హత ఉన్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకొని.. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మధ్యే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో దశ వ్యాక్సిన్ తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న ఆయన ఆ తర్వాత హైదరాబాద్‌లో తన లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే సినిమా షూటింగ్ ముగించుకొని చెన్నై వెళ్లిన ఆయన.. అక్కడ తొలి పనిగా కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌ బీ అమితాబ్.. కూడా రెండో డోస్ పొందారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. తాను కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు పేర్కొన్న బిగ్‌బీ.. ‘‘దూసర భీ హోగయా( రెండోది కూడా పూర్తయింది).. క్రికెట్‌ది కాదు.. కోవిడ్‌ది.. సారీ.. ఇది చాలా బ్యాడ్ జోక్’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘మేడే’, ‘గుడ్బై’చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో హాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘ది ఇంటర్న్’ అనే సినిమా రీమేక్ చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమాల షూటింగ్‌ నిలిచిపోయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uVUWjE
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...