Sunday, 2 May 2021

యశ్ దర్శకుడితో కన్నడలో నితిన్ హిట్ సినిమా రీమేక్.. హీరోగా ఎవరంటే..

నూతన నటీనటులతో సినిమాలు రూపొందించి.. సూపర్ హిట్లు సాధించే దర్శకుల్లో తేజా ముందు ఉంటారు. అలా ఆయన డైరెక్షన్‌లో యూత్ స్టార్ హీరోగా, సదా హీరోయిన్‌గా వచ్చిన సినిమా ‘’. 2002లో విడుదలైన ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే సూపర్ హిట్‌గా నిలిచింది. హీరో హీరోయిన్లే కాదు.. ఈ సినిమాలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలో గోపిచంద్ పండించిన విలనిజం అందరినీ ఆకట్టుకుంది. సినిమా విడుదలై దాదాపు 20 సంవత్సరాలు అవుతుతున్న ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ సినిమాని 2003లో తమిళంలో రీమేక్ చేశారు. ప్రముఖ ఎడిటర్ మోహన్ కుమారుడు రవి ఇందులో హీరోగా నటించాడు. తమిళ్‌లోనూ సదానే హీరోయిన్‌గా చేయగా.. మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అక్కడ ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవి పేరు ‘జయం’ రవిగా మారిపోయింది. ఇక అసలు విషయానికొస్తే.. దాదాపు 20 సంవత్సరాల తర్వాత జయం సినిమాని కన్నడలో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే డాక్టర్ ఈ సినిమా ద్వారా హీరోగా చేస్తున్నాడట. ఎన్ని సంవత్సరాలైన క్రేజ్ తగ్గని జయం సినిమాతో మంచి సక్సెస్ అందుకోవచ్చని ప్రవీణ్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇక రాక్‌స్టార్ యశ్‌ని హీరోగా పరిచయం చేసిన.. శశాంక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. జయం రీమేక్ కంటే ముందు ఓ సినిమా చేస్తున్న ప్రవీణ్.. ఆ తర్వాత జయం రీమేక్‌లో నటిస్తాడు. మరి తెలుగులో హ్యూజ్ సక్సెస్ సాధించిన ‘జయం’ కన్నడలో ఏ రేంజ్ విజయం సాధిస్తుందో వేచి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QGaQQk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...