Sunday, 2 May 2021

కరోనా వచ్చినా కూడా అలా.. ఫ్యామిలీతో బన్నీ హల్చల్.. స్నేహారెడ్డి-అర్హ రచ్చ

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. నిర్విరామంగా పుష్ప షూటింగ్‌లో పాల్గొన్న బన్నీ కరోనా బారిన పడ్దారు. ఈ దెబ్బకు పుష్ప షూటింగ్ అటకెక్కేసింది. అనసూయ, రష్మిక మందాన్న, బన్నీ, ఫాహద్ ఫాజిల్ మధ్యలో అదిరిపోయే సీన్లను తెరకెక్కించాలను సుకుమార్ ప్లాన్ బెడిసి కొట్టేసింది. అలా మొత్తానికి పుష్ప షూటింగ్ నుంచి బన్నీ దూరం కావాల్సి వచ్చింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. ఆ ముందు రోజే రష్మిక మందాన్న లైవ్‌లోకి వచ్చి పుష్ప షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా బన్నీయే కరోనా బారినపడ్డారు. అయితే తాను క్వారంటైన్‌కు పరిమితమయ్యానని చెబుతూ అందరూ జాగ్రత్తగా ఉండమని సలహాలు ఇచ్చారు. ఇక బన్నీకి కరోనా రావడంతో అల్లు శిరీష్ కూడా పరీక్షలు చేయించుకున్నారు. రెండు సార్లు చేయించుకుంటే.. రెండు సార్లూ నెగెటివ్ వచ్చిందంటూ అల్లు శిరీష్ క్లారిటీగా చెప్పారు. అయితే ఇప్పుడు బన్నీ ఇంట్లోనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. కానీ ఈ క్వారంటైన్ సమయంలోనూ ఫ్యామిలీతోనే బన్నీ గడిపేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బన్నీ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. బన్నీ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో అర్హ, స్నేహారెడ్డి రచ్చ చేశారు.గార్డెన్ ఏరియాలో అర్హ, స్నేహారెడ్డిలు కూర్చున్నారు. ఇక స్నేహారెడ్డికి అర్హ జుట్టు వేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా కూడా దూరం నుంచి బన్నీ వీడియో తీసి షేర్ చేశారు. ఇందులో అర్హ, స్నేహారెడ్డిలు మాస్కులు ధరించే ఉన్నారు. ఇంకా బన్నీ కూడా సామాజిక దూరాన్ని పాటించినట్టు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eNZzoX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...